Breaking News

రాష్ట్రంలో దాదాపు 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీ…

-నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన జగన్ రెడ్డి సర్కార్
-ఉపాధి కల్పనలో దిగజారిన ఏపీ ప్రభుత్వం – ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 2022 వరకూ భర్తీ చేసే 10వేల 143 ఉద్యోగాల వివరాలతో సీఎం జగన్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసినా ఇంతవరకు నోటిఫికేషన్ లు ఎందుకు విడుదల చేయలేదని శైలజనాథ్ ప్రశ్నించారు. అవినీతి, పక్షపాతం, వివక్షకు తావులేకుండా పారదర్శకంగా జాబ్ క్యాలెండర్ ఉంటుందని, కేవలం మెరిట్ ఆధారంగానే భర్తీ ఉంటుందని సీఎం జగన్ రెడ్డి ప్రకటించడంతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఎన్నో ఏళ్లుగా అభ్యర్థులు శిక్షణ తీసుకుంటున్నారని, వారు మనోధైర్యం కోల్పోకుండా ఉండేందుకు వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ ఏదీ
రాష్ట్రంలో దాదాపు 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఇప్పటి వరకూ ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. ప్రస్తుతమున్న 25 వేల ఖాళీలను భర్తీ చేసే యోచన కూడా ఉన్నట్టు లేదని, ప్రాథమిక పాఠశాలల విలీనం పేరుతో ఉన్న ఉపాధ్యాయులతోనే సర్కారు సరిపెట్టే ప్రయత్నం చేస్తోందని శైలజనాథ్ ఆరోపించారు.

ఉపాధి కల్పనలో దిగజారిన ఏపీ
ఉపాధి కల్పనలో ఏపీ పరిస్థితి దిగజారిందని, అత్యధిక ఉద్యోగావకాశాలు కలిగిన రాష్ట్రాల జాబితాలో రాష్ట్రం క్రమంగా దిగువకు వెళ్తోందని, 2018లో మొదటి స్థానంలో ఉన్న ఏపీ 2022కు వచ్చేసరికి ఏడుకు పడిపోయిందన్నారు. అత్యధిక ఉద్యోగావకాశాలు కలిగిన రాష్ట్రాల జాబితాలో రాష్ట్రం క్రమంగా దిగువకు వెళ్తోందని, 2018లో మొదటి స్థానంలో ఉన్న ఏపీ 2022కు వచ్చేసరికి ఏడుకు పడిపోయిందని శైలజనాథ్ పేర్కొన్నారు. మొదటి 10 రాష్ట్రాల జాబితాలో గతేడాది ఐదో స్థానంలో ఉండగా ఈ ఏడాది 2 మెట్లు కిందకు వెళ్లిపోయిందని, ఇటీవల విడుదలైన భారత నైపుణ్యాల నివేదిక-2022 ఈ విషయాలను వెల్లడించిందని చెప్పారు. ఉద్యోగాలు సాధించే ప్రతిభ (ఎంప్లాయిబుల్ టాలెంట్) కలిగిన అభ్యర్థులను అందించే మొదటి మూడు రాష్ట్రాల జాబితాలోనూ ఏపీకి స్థానం దక్కలేదని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ తెలిపారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *