Breaking News

“యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి” గుంటూరు వెస్ట్ ఎం ఎల్ ఏ మద్దాలి గిరిధర్


గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు భారత ప్రభుత్వము, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర, గుంటూరు వారి ఆద్వర్యం లో స్థానిక జె కె సి కాలేజి లోని ఆడిటోరియంలో జిల్లాస్థాయి యూత్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగా యువత స్కిల్స్, లేబర్ వెల్ఫేర్, బేటి బచావో బేటి పడావో, వుమన్, చిల్డ్రన్, ఓల్డ్ ఏజ్ అండ్ మైనారిటీస్, అర్బన్ డెవలప్మెంట్, వాటర్ అండ్ శానిటేషన్, హోసింగ్ అండ్ ఆమెనీటిస్, వ్యవసాయం, హెల్త్, స్టార్ట్ అప్ ఇండియా, ముద్ర, పి ఎం ఈజిపి, ఇన్ క్రెడిబుల్ ఇండియా, డిజిటల్ ఇండియా , ఎడ్యుకేషన్, సైన్స్ మరియు టెక్నాలజీ లలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభత్వాలు అందిస్తున్న వివిధ పధకాలు వాటి అమలు మరియు ఉపయోగాలు, రాజకీయాల్లో యువత పాత్ర, స్వచ్ఛ భారత్ ఆయుష్మాన్ భారత్ వంటి అంశాలపై విస్తృతం గా జిల్లాస్థాయి యూత్ పార్లమెంట్లో చర్చించారు.

ఈ కార్యక్రమానికి నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు యానాం సంచాలకులు బి జె ప్రసన్న అధ్యక్షత వహించగా ముఖ్య అతిధి గా హాజరైన గుంటూరు వెస్ట్ ఎం ఎల్ ఏ మద్దాలి గిరిధర్ ముందుగా ఈ కార్యక్రమాన్ని భారత మాత పటానికి పూలమాలలు వేసి ప్రారంభించారు ఆ తరువాత ఆయన మాట్లాడుతూ యువత నాయకత్వ లక్షణాలు పెంచుకుని రాజకీయాల్లో కూడా రాణించాలని అన్నారు. అదేవిధంగా పలు పధకాల గురించి యువత మధ్య చర్చ జరగటం వలన ఆ పధకాలు ఇంకా విస్తృతంగా ప్రజలు వినియోగించుకునే అవకాశం ఉంది అని అన్నారు. అలాగే మన దేశం లో ఎక్కువ మంది యువత ఉన్నారు, ఈ యువ శక్తి ని రాజకీయాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు దేశ నిర్మాణానికి ఉపయోగిస్తే దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలపవచ్చు అన్నారు. స్కిల్ డెవలప్ కార్పొరేషన్ ద్వారా మన రాష్టంలో చాలా రకాల శిక్షణ కార్య క్రమాలు చేపట్టి యువతను ఉద్యోగులుగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశం లో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నది అని అన్నారు. నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు యానాం సంచాలకులు బి జె ప్రసన్న ప్రసంగిస్తూ యువత ప్రజా సమస్యలతో నిమగ్నమవ్వడానికి ఇటువంటి కార్య క్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. అలాగే దేశ వ్యాప్తముగా నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ యువత కోసం నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భముగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పధకాలు మరియు నెహ్రూ యువ కేంద్ర వారు నిర్వహించు కార్యక్రమాలు పై రూపొందించిన బ్రోచర్ బుక్లెట్ ని అతిధులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు స్టెప్ సీఈవో మరియు డిస్టిక్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ డా. వి శ్రీనివాసరావు మాట్లాడుతూ యువకులు దైర్యంగా స్థిరంగా తమ తమ అభిప్రాయాలను వెల్లడించాలని వారి వాణి దేశ వ్యాప్తంగా వినిపించిన నాడు వారి అభిప్రాయాలూ చట్ట సభలలోను పరిగణన లోకి తీసుకొనే అవకాశం ఉంటుందని అందువల్ల ప్రతిఒక్కరు తమ అభిప్రాయాలను నిష్పక్షపాతం గా వినిపించాలని, నెహ్రూ యువ కేంద్ర సంఘఠన్ అధికారులు, నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్లు, యువ జన సంఘాల సభ్యులు ఇందుకు కృషి చేయాలనీ కోరారు. యువత లో మానసిక వికాసం పెంపొందించటానికి అలాగే లైఫ్ స్కిల్స్ పెంచుకోవటానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోన్న స్పందన ఇదా ఇంటర్నేషనల్ పౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ శామ్యూల్ రెడ్డి మాట్లాడుతూ నవ భారత నిర్మాణానికి యువత సహకారం మరియు పరిష్కారాలు ఎంతో అవసరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా నెహ్రూ యువ కేంద్ర డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ కిరణ్మయి దేవిరెడ్డి, జెకెసి కాలేజ్ డైరెక్టర్ ఎస్ ఆర్ కే ప్రసాద్, జెకెసి కాలేజ్ ప్రిన్సిపల్ ఐ నాగేశ్వరరావు, గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆర్థో ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ ఎస్ వి రమణ, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ ఈదర రాంబాబు, గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి సురేష్ కుమార్, ఎంఫిజో ఐటీ సోల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్ డా. బిళ్ళా కిరణ్ కుమార్, సిడబ్ల్యుసి డిస్ట్రిక్ట్ ఎక్స్ చైర్మన్ సుజ్ఞాన రాణి, నేషనల్ గ్రీన్ కోర్ డిస్టిక్ కో ఆర్డినేటర్ డి. తిరుపతి రెడ్డి గౌరవ అతిధులుగా పాల్గొని ప్రసంగించగా, అతిధులకు ఈ సందర్భముగా దుశ్శాలువాలు మరియు జ్ఞాపికలతో సన్మానించడం జరిగింది. ఈ జిల్లా యూత్ పార్లమెంట్ లో పాల్గొన్న అందరు పార్టిసిపంట్స్ కు సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమములో పెద్ద ఎత్తున యువత మరియు యువజన సంఘాలు పాల్గొన్నాయి.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *