Breaking News

పధకం అమలులో ‘లైట్’ తీసుకునే అధికారులపై చర్యలు : జిల్లా కలెక్టర్ జె. నివాస్

-జగనన్న ఇళ్ల ప్రతీ లబ్ధిదారుడు ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న ఇళ్ళు పధకంలో ఇల్లు మంజూరైన ప్రతీ లబ్ధిదారుడు ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. జగనన్న ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిపై స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి శుక్రవారం మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ జిల్లాలో జగనన్న ఇళ్ల పధకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఇది సరైన సమయమని , సంబంధిత శాఖల అధికారులందరూ జగనన్న ఇళ్ల పథకంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుని, నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. ఈ పధకం అమలును ‘లైట్ ‘ తీసుకునే అధికారులను ఉపేక్షించమని కలెక్టర్ హెచ్చరించారు. జగనన్న ఇళ్ల లేఔట్ లలో నిర్మాణ మెటీరియల్ నిర్మాణ ప్రాంతానికి వెళ్లేందుకు వీలుగా రోడ్లు నిర్మించాలన్నారు. ఆంతేకాక విద్యుత్, నీటి సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలు కపించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పెదపారుపూడి మండలంలో భూషణ్ గూడ గ్రామంలో 25 మంది డ్వాక్రా మహిళలు ఇళ్ల నిర్మాణానికి రుణాలు తీసుకుని కూడా ఇంకా ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించడకపోవడం, అధికారులు పర్యవేక్షించకపోవడంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రుణాలు తీసుకున్న లబ్ధిదారులతో వెంటనే ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఉచిత ఇసుక, సబ్సిడీపై అందిస్తున్న సిమెంట్, ఐరన్ వంటి నిర్మాణ సామాగ్రి ఎటువంటి జాప్యం లేకుండా లబ్దిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణానికి సంబందించిన బిల్లుల చెలింపులు నిర్ణీత సమయంలోగా చెలించేందుకు గృహ నిర్మాణ శాఖాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్లు డా. కె.మాధవీలత, ఎల్. శివశంకర్, కె. మోహన్ కుమార్, నుపుర్ శ్రీవాస్ అజయ్ కుమార్, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ అధికారి రామచంద్రన్, ప్రభృతులు పాల్గొన్నారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *