UEEU APCPDCL 2వ మహాసభలను జయప్రదం చేయండి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్(UEEU – CITU) APCPDCL 2వ మహాసభలు నవంబర్ 15 వ తేదీ ఆదివారం ప్రకాశం సర్కిల్ కందుకూరు UTF భవన్ లో జరుగుతున్నవి ఈ మహాసభలను జయప్రదాన్ని కాంక్షిస్తూ ఈ రోజు NTR జిల్లా CITU కార్యాలయంలో పోష్టర్ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో యూనియన్ డిస్కం కమిటీ ప్రధాన కార్యదర్శి ఎల్.రాజు, యూనియన్ గౌరవాధ్యక్షులు CITU జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.సి.హెచ్.శ్రీనివాస్ యూనియన్ నాయకులు కె.నాగేశ్వరరావు, వి.బి.కోటేశ్వరరావు, సురేష్, షేక్ దరియావలి, షేక్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
డిస్కం ప్రధాన కార్యదర్శి ఎల్.రాజు మాట్లాడుతూ 24/7,360 రోజులు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందిస్తూ ప్రమాదకర పరిస్థితుల్లో, ప్రకృతి వైపరీత్యాలలో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం, యాజమాన్యం సత్వరం చర్యలు తీసుకుని సమస్యలు పరిష్కరించాలన్నారు అమరావతి సర్కిల్లో CRDA ప్రాంతాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలి, ఉద్యోగులపై పని భారాన్ని పెంచే విధానాలను తగ్గించాలి, గత PRC లో ఉద్యోగులందరు ఆర్థికంగా నష్టపోయారు 2026 ఏప్రిల్ నుండి అమలు కావాల్సిన PRC మెరుగైన ఫిట్ మెంట్ తో జాప్యం చేయకుండా ప్రకటించాలి వెయిటేజ్ ఇంక్రిమెంట్లు పునరుద్ధరించాలి, లోపభూయిష్టమైన TATA AIG మెడికల్ పాలసీ రద్దు చేసి మెరుగైన అన్ లిమిటెడ్ మెడికల్ పాలసి అమలు చెయ్యాలి,పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి EPF హయ్యర్ పెన్షన్ సమస్య పరిష్కరించాలి, కాంట్రాక్టు కార్మికులందరిని సంస్థలో విలీనం చేసి సంస్థ ద్వారా నేరుగా వేతనాలు చెల్లించాలి,కన్వర్వషన్స్ ద్వారా JLM అయిన గ్రేడ్ – 2 కార్మికులందరికి ALM ప్రమెషన్లివ్వాలన్నారు.
ఈ మహాసభల్లో డిస్కం పరిధిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పలు తీర్మానాలతో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించబోతున్న ఈ మహాసభలను జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు