-ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రూప్స్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ సిగ్నల్ లభించింది. జాబ్ క్యాలండర్ పోస్టులకంటే అదనంగా భర్తీకి అనుమతి ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. దీంతో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. గ్రూప్ 1 కేటగిరీ కింద 110 పోస్టులు, గ్రూప్-2 కేటగిరీ కింద 182 పోస్టులకు అనుమతి లభించింది. దీంతో ఏపీపీఎస్సీ త్వరలో నోటిఫికేషన్లు జారీ చేయనుంది. డిప్యూటీ కలెక్టర్లు, ఆర్టీవో, సీటీవో, డిఎస్పీ, డి ఎఫ్ ఓ, మున్సిపల్ కమిషనర్, ఎంపిడివో పోస్టుల భర్తీకి, ఇక గ్రూప్-2 లో డిప్యూటీ తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్ లు, మున్సిపల్ కమిషనర్ లు, ట్రెజరీ అధికారులు తదితర ఖాళీల భర్తీకి సీఎం వైఎస్ జగన్ అనుమతి ఇచ్చారు.