విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని జర్నలిస్ట్ లకు సోమవారం ప్రెస్ క్లబ్ లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అక్షయ పాత్ర ఫౌండేషన్ కార్యదర్శి విలాస మార్గాని దాస్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి వలన అన్ని రంగాలు దెబ్బతిన్నాయని, మీడియా రంగం మరింత దారుణంగా దెబ్బతిన్నదని అన్నారు. కాని కరోనా వైరస్ బారి నుంచి కాపాడేందుకు ప్రజలను అప్రమత్తం చేయడంలో జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి మరీ కీలక భూమిక పోషించారని కొనియాడారు. అందుకే తాము చేసే సేవాకార్యక్రమాలలో భాగంగా జర్నలిస్ట్ లను కూడా కొంతమేరకు ఆదుకోవాలనే సదుద్దేశం తోనే తాము ప్రెస్ క్లబ్ ద్వారా నిత్యావసరాల పంపిణీ చేస్తున్నామన్నారు. ఐ జే యూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో నిరుపేదలను ఆదుకునేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ చేస్తున్న సేవలు వెలకట్టలేనివని వారిని అభినందించారు. దీనిలో భాగంగా జర్నలిస్ట్ ల సేవలను గుర్తించి, సహాయం పడేందుకు ముందుకొచ్చిన అక్షయ పాత్ర ఫౌండేషన్ వారికి క్రృతజ్ణతలు తెలియజేశారు. ఏపీయూడబ్లూజే క్రృష్ణా అర్బన్ అధ్యక్షుడు చావా రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతి రావు, ఉపాధ్యక్షులు మోదుమూడి మురళి పాల్గొనగా, 200 మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
Tags vijayawada
Check Also
ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ …