న‌య‌న మ‌నోహ‌రంగా శ్రీ పంచముఖ ఆంజనేయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

-స్వామి వారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాచవరం దాసాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ పంచముఖ ఆంజనేయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సోమవారం వైభవోపేతంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య సాంప్రదాయ బద్ధంగా ఈ క్రతువు నిర్వహించారు. కన్నుల పండువగా జరిగిన ఈ వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తొలుత ఆలయ అధికారులు వారికి సంప్రదాయ‌బద్దంగా స్వాగ‌తం ప‌లికారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. మాచవరంలో వెలసిన శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉందన్నారు. అటువంటి మహిమాన్వితమైన దాసాంజనేయస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం కొబ్బరికాయలు కొట్టి నివేదన చేసుకునేందుకు శ్రీ పంచముఖ ఆంజనేయ విగ్రహాన్ని ప్రతిష్టించుకోవడం శుభపరిణామమన్నారు. ఆ ప్రసన్నాంజనేయ స్వామి చల్లని చూపు నియోజకవర్గ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలని కోరుకున్నారు. స్వామి వారి కృపా కటాక్షాలతో ప్రతీ ఒక్కరూ జీవితంలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారి శేష వస్త్రంతో ఎమ్మెల్యే మల్లాది విష్ణును సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి చైర్మన్ కనపర్తి కొండలరావు, డివిజన్ ఇంఛార్జి అంగిరేకుల నాగేశ్వరరావు, ఈవో నాగినేని భవానీ, పాలకమండలి సభ్యులు కోలా సూరాంభ, సత్యవతి, కోలుకొండ శ్రీనివాసులు, పాండు రంగారావు, శీరంశెట్టి శ్రీనివాస్, నాయకులు నాగాంజనేయులు, భక్తులు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *