-ఆర్చియన్ కెమికల్స్ ఎండి స్వామినాథన్ తో మంత్రి లోకేష్ భేటీ
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త:
ఆర్చియన్ కెమికల్ ఇండస్ట్రీస్ సిఇఓ & మేనేజింగ్ డైరక్టర్ రామ్ప్రవీణ్ స్వామినాథన్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి విశాఖ సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ ప్రాంగణంలో భేటీ అయ్యారు. మంత్రి లోకేష్ చర్చల అనంతరం రాష్ట్రంలో రూ.3వేల కోట్లతో జింక్-బ్రోమైడ్ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ (2 × 5 జీడబ్ల్యూహెచ్/సంవత్సరం) ఏర్పాటుకు స్వామినాథన్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. దీనిద్వారా రాష్ట్రంలోని యువతకు 1,000 ఉద్యోగాలు లభించనున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చిన ఆర్చియన్ సంస్థకు మంత్రి లోకేష్ ధన్యవాదాలు చెప్పారు. ప్రాజెక్టు గ్రౌండింగ్ కు రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని అన్నారు.
