అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో సీఎం చేతుల మీదుగా ఇళ్ళ పట్టాల పంపిణీ. ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.40 గంటలకు సబ్బవరం మండలం పైడివాడ చేరుకుంటారు. 11.05 గంటలకు వేదిక వద్దకు చేరుకుని వైఎస్సార్ విగ్రహావిష్కరణ, పార్కు ప్రారంభోత్సవం, లే అవుట్ల పరిశీలన, మోడల్ హౌస్‌లను లబ్ధిదారులకు అందజేయడం, పైలాన్ ప్రారంభోత్సవం, ల్యాండ్ పూలింగ్ కోసం భూములిచ్చిన రైతులతో ఫోటో సెషన్, తదితర కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం ముఖ్యమంత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత పట్టాలు, హౌసింగ్ స్కీమ్ మంజూరు పత్రాల పంపిణీ చేస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని 2.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
Tags amaravathi
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …