Breaking News

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు అసోసియేషన్లతో APNRTS వర్చువల్ సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ APNRT సొసైటీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు అసోసియేషన్లతో 01.05.22 రాత్రి 8 గంటల 30 నిమిషాలకు వర్చువల్ సమావేశం నిర్వహించింది. APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవాసాంధ్రులకు అందిస్తున్న వివిధ ఉచిత సేవలను మేడపాటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తెలుగు అసోసియేషన్ల అధ్యక్షులు, సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలు చాలా ఉపయోగకరమైనవి, విలువైనవి అని కొనియాడారు. విద్యార్థులు, ఉద్యోగులకు ఉపయోగకరమైన ప్రవాసాంధ్ర భరోసా బీమా, అధునాతన కోర్సులలో ఆన్ లైన్ IT శిక్షణ, ఏపీ పోలీస్ ఎన్నారై సెల్, దేవాలయాల దర్శనాలు, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ (APTDC) ద్వారా ప్రవాసాంధ్రులకు APTDC రిసార్ట్స్ లో 20 శాతం రాయితీ, ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో ఉన్న వలసకార్మికుల కొరకు 24/7 హెల్ప్ లైన్ మైగ్రంట్ రిసోర్స్ సెంటర్ ద్వారా అందిస్తున్న ఉచిత అంబులెన్సు సేవ, ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా, ఆయా దేశాల భారత రాయబార కార్యాలయాలు మరియు APNRTS కో ఆర్డినేటర్స్ సమన్వయంతో అత్యవసర పరిస్థితులలో వలస కార్మికులను స్వదేశానికి తీసుకురావడం, బకాయి జీతాలు సంస్థ చెల్లించేలా చేయడం, అంతేకాకుండా వీరికి అవగాహన కల్పించడానికి వలసలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో సక్రమ వలసల పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం వంటి ఎన్నో సేవలు ప్రసంశనీయమన్నారు. ఈ సేవా కార్యక్రమాల గురించి తమ తమ దేశాల్లో మరింత ప్రచారం చేస్తామని పలు తెలుగు అసోసియేషన్లు తెలిపాయి.

మేడపాటి మాట్లాడుతూ….అందరికీ విద్య, వైద్యం అందుబాటులో ఉండాలన్న గొప్ప సంకల్పంతో  ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి నాడు – నేడు రెండవ దశ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఈ గొప్ప సంకల్పం మరియు రాష్ట్రాభివృద్ధిలో మీ వంతు సహాయ సహకారాలు అందించాలని అసోసియేషన్లకు విజ్ఞప్తి చేసారు. అలాగే ఇలాంటి సమావేశాలు ప్రతి మూడు నెలలకొకసారి నిర్వహిస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో ఎం. జ్ఞానేంద్ర రెడ్డి, ఎన్నారై అడ్వైజర్ (క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్), మాజీ లోకసభ ఎంపీ,  ఎ. గీతేష్ శర్మ, ఐఎఫ్ఎస్ (రిటైర్డ్), స్పెషల్ ఆఫీసర్ – ఇంటర్నేషనల్ కో ఆపరేషన్, APNRTS సీఈఓ శ్రీ దినేష్ కుమార్ పాల్గొని తమ ఆలోచనలను, అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ వర్చువల్ సమావేశంలో తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) అద్యక్షులు అంజయ్య చౌదరి లావు, నార్త్ అమెరికన్ తెలుగు అసోషియేషన్ (NATA)అధ్యక్షులు  శ్రీధర్ కొర్సపాటి, ఫ్రాన్స్ తెలుగు అసోషియేషన్ (FTA), తెలుగు అలయన్స్ అఫ్ కెనడా (TACA), వెస్ట్రన్ ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్ (WATA), ఫిన్లాండ్ తెలుగు అసోసియేషన్ – ఫిన్లాండ్, సౌత్ ఆఫ్రికా తెలుగు కమ్యూనిటీ (SATC), బుడాపెస్ట్ తెలుగు అసోసియేషన్ – హంగేరి, ఆంధ్రకళా వేదిక – ఖతార్ లాంటి అసోసియేషన్లు, అలాగే యుఎస్ఎ, యుకె, కెనడా, ఫ్రాన్స్, ఖతార్, సౌత్ ఆఫ్రికా, ఐర్లాండ్, ఫిన్లాండ్, ఆస్ట్రియా, హంగేరీ మరియు యురోపియన్ దేశాలలోని పలు తెలుగు అసోసియేషన్లు పాల్గొన్నాయి.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *