-నవంబర్ 16న గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కార్యక్రమం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
నగర ప్రజల స్థానిక సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు నవంబర్ 16వ తేదీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్) నిర్వహించనున్నట్లు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్ తెలిపారు. సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా జీఎంసీకి చెందిన వివిధ విభాగాల అధిపతులతో కలిసి ప్రజల నుంచి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. నగర ప్రజలు తమ స్థానిక సమస్యలను ఈ వేదిక ద్వారా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి అవకాశం వినియోగించుకోవాలని కమిషనర్ కె. మయూర్ అశోక్ సూచించారు.
