విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాలల అక్రమ రవాణా బాలికల పై లైంగిక వేదింపులు బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థల నిర్మూలనకు అధికారులు స్వచ్చంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు. జిల్లా బాలల సంరక్షణ కమిటితో జిల్లా కలెక్టర్ డిల్లీరావు బాలల సంరక్షణ పై తీసుకోవాల్సిన చర్యలపై గూగుల్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో బాలల సంరక్షణ కమిటి సభ్యులు సమర్థవంతంగా పనిచేసి బాలల సంరక్షణకు మరింత శ్రద్ద వహించాలన్నారు. బాలల పై లైంగిక వేదింపులు జరగకుండా చర్యలు తీసుకోవాలని వేదింపులకు పాల్పడే వారి పై ఫోక్టో చట్టం కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. బాల్య వివాహల నిర్మూలనపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ద వహించాలని బాల్య వివాహలు జరిపించే కుటుంబ సభ్యులతో పాటు పురోహితులపై కూడా కేసులు నమోదే చేయలన్నారు. బాలకార్మిక చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు బాలాలతో పనిచేయించుకుంటున్నావారిపై కేసులు నమోదు చేసి సంబంధిత బాలలను బాలల సంరక్షణ కేంద్రాలకు తరలించాలన్నారు. వీధులలలో చిన్నారులతో భిక్షాటన చేయిస్తున్నవారిని గుర్తించి అటువంటి వారిపై కేసులు నమోదు చేసి బాలలను సంరక్షణ కేంద్రాలలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాల సంరక్షణ కొరకు 1098, పోలీస్ సహాయం కొరకు 100, మహిళ సహాయం కొరకు ఏర్పాటు చేసిన 181 నెంబర్లపై లఘు చిత్రాలు, కరపత్రాలు, గోడ పత్రాలు ద్వారా విసృత్త ప్రచారం కల్పించి ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోనేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో బాలల అక్రమ రవాణా, బాలికల పై లైంగిక వేదింపులు, బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థల నిర్మూలన వంటి అంశాలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సులను నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. మహిళలపై జరిగే అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేదింపుల వంటి నివారించేందుకు ఏర్పాటు చేసిన దిశ యాప్‌ను మహిళలు డౌన్‌లోడ్ చేసేకునేందుకు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ ద్వారా జిల్లాలో ఒకే రోజు దాదాపు 1 లక్షా 75 వేల మంది యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాడంలో భాగస్వామ్యులైన జిల్లా అధికారులు ఉద్యోగులు, వాలంటీర్లు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. కాన్ఫరెన్స్‌లో డిఆర్‌వో కె.మోహన్‌కుమార్, ఐసిడిసి పిడి ఉమాదేవి, డిపివో కె. బాస్కర్, కార్మిక శాఖ డిప్యూటి డైరెక్టర్ ఆషారాణి, ఎన్‌సిఎల్‌పి పిడి ఆంజనేయరెడ్డి, ఎస్‌కెసివి పరిపాలన అధికారి జాన్‌ప్రభాకర్,జెయంజె ప్రజ్వల హోం నిర్వహురాలు సిస్టర్ సరిత, నవజీవన్ బాలభవన్ డైరెక్టర్ ఫాదర్ రత్నకుమార్, చైల్డ్ లైన్ జిల్లా కో ఆర్డినేటర్ రమేష్ అరవ, రైల్వే కో ర్డినేటర్ శ్రీకాంత్, సిటి కో ఆర్డినేటర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Tags vijaya
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …