గుణదలలో ఘనంగా ‘స్వీట్ వే కేక్స్’ నూతన షోరూమ్ ప్రారంభం

-పదేళ్ల అనుభవంతో విభిన్న రుచులు.. ఆకర్షణీయమైన డిజైన్లలో కేకులు, ఆరోగ్యకరమైన బేకరీ ఉత్పత్తులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
వివిధ రకాల కళాత్మక డిజైన్లతో, నోరూరించే రుచికరమైన కేకుల తయారీలో ప్రత్యేక గుర్తింపు పొందిన ‘స్వీట్ వే కేక్స్’  నూతన షోరూమ్ సోమవారం గుణదలలో ఘనంగా ప్రారంభమైంది. ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన ఈ షోరూమ్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ అద్దంకి అయ్యప్ప మణికంఠ మాట్లాడుతూ.. పదేళ్ల సుదీర్ఘ అనుభవంతో విజయవాడలో వినూత్నమైన కేకులను అందిస్తున్నామని తెలిపారు. మెట్రోపాలిటన్ నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండే అరుదైన ఫ్రూట్ కేకులు, యానిమల్ థీమ్ కేకులను తమ సంస్థ ద్వారా వినియోగదారులకు పరిచయం చేస్తున్నామని చెప్పారు.
వివిధ రకాల వేడుకలకు అవసరమైన ప్రత్యేక కేకులు ముందస్తు ఆర్డర్ల కోసం వేచి చూడకుండా, అప్పటికప్పుడు కొనుగోలు చేసుకునేలా కౌంటర్‌లో సిద్ధంగా ఉంచుతున్నామని వివరించారు. వివాహాలు, ఇతర శుభకార్యాలకు 100 మంది నుంచి 10 వేల మంది వరకు సరిపడా డెజర్ట్‌లను ఆర్డర్లపై తయారుచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేస్తున్నామని వెల్లడించారు.
ఆరోగ్యకరమైన బేకరీ ఉత్పత్తులకు ప్రాధాన్యత
బేకరీ ఉత్పత్తులన్నీ మైదా పిండితోనే తయారవుతాయనే అపోహను తొలగించేలా ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలతోనూ ఉత్పత్తులను తయారుచేస్తున్నామని అయ్యప్ప మణికంఠ తెలిపారు. ఓట్స్, రాగి పిండి, గోధుమ పిండి, అరటిపండు, బెల్లం, ఖర్జూరం వంటి పదార్థాలతో ప్రత్యేక ఉత్పత్తులను అందిస్తున్నట్లు చెప్పారు.
ప్రత్యేక ఆకర్షణగా ప్రోటీన్ ఉత్పత్తులు
ఆల్మండ్ కుకీస్, ప్రోటీన్ బ్రెడ్, ప్రోటీన్ కేకులు తమ సంస్థలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికే మొగల్రాజపురం, గన్నవరం, ఏలూరు, కాకినాడ ప్రాంతాల్లో ఫ్రాంచైజీలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా విభిన్న ఆకృతుల్లో నాణ్యమైన, రుచికరమైన ఉత్పత్తులను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అద్దంకి. అంజేష్ కుమార్, సంస్థ మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.