-పలు ఆలయాల్లో పూజల్లో పాల్గొన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త:
మొదటి కార్తీక సోమవారం సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ తన సతీమణితో కలిసి పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీనగర్ కాలనీ డివిజన్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందారు.
తదుపరి అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల దీక్ష చేపట్టిన అయ్యప్ప భక్తుల కోసం ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వెంగళరావునగర్ డివిజన్లోని డీటీఎచ్ దేవాలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వాములకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ నిర్వాహకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
