గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
పాత గుంటూరులోని శ్రీ గణపతి, అగస్తేశ్వర స్వామి దేవస్థానాన్ని గుంటూరు నగర మేయర్ శ్రీమతి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ దర్శించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు నగర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని, నగరం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. దైవానుగ్రహంతో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే శక్తిని ప్రసాదించాలని, ప్రజాసేవలో నిరంతరం అంకితభావంతో ముందుకు సాగే సంకల్పాన్ని కల్పించాలని అమ్మవారిని, స్వామివారిని వేడుకున్నారు.
శ్రీ గణపతి, అగస్తేశ్వర స్వామి సన్నిధిలో మేయర్ లక్ష్మీ అపర్ణ ప్రత్యేక పూజలు
