విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలోని “సుజనా ఫౌండేషన్” ద్వారా శనివారం, చిట్టినగర్, సర్కిల్ వన్ కార్యాలయం వద్ద నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రజారోగ్యమే లక్ష్యంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి, పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి వారం ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ వైద్య శిబిరంలో డెంటల్, కంటి పరీక్షలు, జనరల్ ఫిజీషియన్ వైద్య సేవలతో పాటు బీ పీ, షుగర్, ఈ సీ జీ, 2డి ఎకో, ఎక్స్ రే, మరియు రక్త పరీక్షలు, ఉచితంగా చేస్తున్నారు. “సుజనా ఫౌండేషన్” కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేద ,మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా అందిస్తూ ప్రజారోగ్యమే లక్ష్యంగా పనిచేస్తుంది.
ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ శిబిరంలో 136 మందికి నిపుణులైన వైద్యుల బృందం ప్రత్యేక శ్రద్ధతో చికిత్సలు అందించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. శంకర నేత్ర చికిత్సాలయ, సిద్ధార్థ డెంటల్ హాస్పిటల్ డాక్టర్స్,హెల్ప్ హాస్పిటల్ డాక్టర్స్, కూటమి కార్పొరేటర్లు గుర్రం కనకదుర్గ, బెవర జోగేశ్వరరావు, కూటమి నాయకులు
మద్దిల రామకృష్ణ, నాగోతి రామారావు, వెంపలి గౌరీ శంకర్, బీ ఎస్ కే పట్నాయక్, ఎం అప్పారావు, దేవిన హరి ప్రసాద్,ధనాల శ్రీనివాసరావు, చుక్కా నరేష్, పోకల నాగబాబు, కుంబా రవి, శీలం చందు, సాయి తేజ,ఆకారపు విజయ కుమారి , సుజనా ఫౌండేషన్ సిబ్బంది , సుజనా మిత్రా కోఆర్డినేటర్లు ఈ శిబిరంలో తమ సేవలందించారు.
