-నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలి – మాజీ మంత్రి దేవినేని ఉమా
రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త:
తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రుడా చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయి కార్యాచరణపై నాయకులతో విస్తృతంగా చర్చించారు. మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను పంచాయతీ ఎన్నికల్లోనూ పునరావృతం చేసే దిశగా గ్రామాల వారీగా సమగ్ర ప్రణాళిక రూపొందించి ముందుకు సాగాలని నిర్ణయించారు. ప్రతి గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో, సమిష్టి కృషితో పనిచేయాలని, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఐక్యతను కొనసాగిస్తూ ఎన్నికల కార్యాచరణను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దేవినేని ఉమా సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ కూటమి అభ్యర్థులకు మద్దతుగా సమన్వయంతో పనిచేసేలా సముద్ర కార్యాచరణ రూపొందించారు.
