మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన ఎల్ ఓ సీ ను కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి అందజేశారు. 53 వ డివిజన్, ప్రైజర్ పేటకు చెందిన గండి చిన్ని ( 53) పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్, రక్తనాళాల సమస్యతో బాధపడుతూ వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 6.63 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు. భవానిపురం, ఎన్డీయే కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా ఇన్చార్జ్ దుర్బేసుల హుస్సేన్,53 వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు సోంపాక చినబాబుతో
కలిసి అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.