రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జూన్ 1 బుదవారం పశ్చిమ డెల్టా, సెంట్రల్ డెల్టా, తూర్పు డెల్టా లకు సాగు నీరు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలియచేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంఛార్జి మంత్రి, బిసి సంక్షేమ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి సిహెచ్. శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ, రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత, శాసనసభ్యులు జక్కంపూడి రాజా, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొంటారని తెలియచేశారు.
Prajavartha Online Telugu News