Breaking News

నిరుపేదల పక్షపాతి డాక్టర్ వైఎస్ఆర్

-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రిగా తన హయాంలో నిరుపేదల పక్షపాతిగా దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి పేదలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలను గెలుచుకున్నారని రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా సందేశం అందిస్తూ అట్టడుగు స్థాయి ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడమే కాక, సంతృప్త స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం గొప్ప విషయమన్నారు. డాక్టర్ వైఎస్‌ఆర్ అసమాన నాయకత్వం, పరిపాలనా దక్షతకు రాష్ట్రంలో నీటిపారుదల రంగం, ఇతర సంక్షేమ చర్యలు నిదర్శనంగా నిలుస్తాయని గవర్నర్ హరిచందన్ పేర్కొన్నారు. రాజశేఖర రెడ్డిని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అభివృద్ది , సంక్షేమం రెండు కళ్లుగా జనరంజక పాలన అందించారని ప్రస్తుతించారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *