తిరుపతి, నేటి పత్రిక ప్రజా వార్త :
తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ యూ. శ్రీహరి ఆధ్వర్యంలో మంగళవారం లింగ నిర్ధారణ చట్టం పైన వివిధ అనుబంధ శాఖల అధికారులు ప్రతినిధులకు వర్కుషాప్ నిర్వహించబడింది. ప్రస్తుతం సమాజం లో జన్మిస్తున్న మగ ఆడ శిశువుల నిష్పత్తి 1000:943 మాత్రమే ఉన్నదని ఈ సంఖ్య క్రమేపి తగ్గిపోతే భవిష్యత్తు లో ప్రమాద మని కనుక ప్రజలు లింగవివక్షత చూప రాదని అలాగే లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడిన వారికి తొలిసారి 10000 రూపాయలు జరీమాన తో బాటు 3 సంవత్సరాల కఠిన కారాగారా శిక్ష ఉంటుందని అలాగే ఈ చర్యలకు మళ్ళీ మళ్ళీ పాల్పడితే శిక్షలు తీవ్ర స్థాయి లో ఉంటుందని వక్తలు తెలియజేసారు. ప్రజలలో ఈ కార్యక్రమం పైన విస్తృత ప్రచారం కల్పించాలని తెలియజేసారు. కార్యక్రమం లో Dr శాంత కుమారి DIO, Dr హనుమంత రావు, Dr సుధారాణి Dy DMHO లు, ఆనంద రెడ్డి DYEO, రామరాజు DSP, అరుణ SI దిశా పోలీస్ స్టేషన్ Smt ఇంద్రాణి లీగల్ అడ్వైసర్, కిరణ్ కుమార్, జయరాం డిప్యూటీ డెమోలు ఇతరులు పాల్గొన్నారు.
Tags tirupathi
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …