పెడన, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ [APSSDC] డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ [DRDA] మరియు సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైస్ డెవలప్మెంట్ [SEEDAP] మరియు ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి వారి సంయుక్త ఆధ్వర్యంలో పెడన పట్టణంలోని సెయింట్ విన్సెంట్ పల్లోటి స్కూల్ నందు ఈ నెల 30 వ తేదీన అనగా శుక్రవారం భారీ జాబ్ ఫెయిర్ ను నిర్వహించనున్నారని మంత్రి గారి కార్యాలయం నుంచి వెలువడిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్న ఈ భారీ జాబ్ ఫెయిర్ ద్వారా 19 ప్రముఖ కంపెనీల్లో 1500 లకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారని, టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీఫార్మసీ, ఎంఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, డ్రైవర్స్, బీఈ, బీటెక్, ఎంటెక్, బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ చేసిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరుకావొచ్చని ఈ ప్రకటనలో తెలియజేశారు.
కియా మోటార్స్, హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్, ఆరబిందో ఫార్మా , అపోలో ఫార్మా ,మెడ్ ప్లస్ ఫార్మా, ఈ కార్ట్ లాజిస్టిక్స్ లాంటి బహుళ జాతి సంస్థలు మరియు ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలైన చందు సాఫ్ట్,టెక్ తమ్మిన ఈ జాబ్ జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని ఈ ప్రకటనలో వివరించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఇప్పటికే పలు జాబ్ ఫెయిర్ లు నిర్వహించి వేల సంఖ్యలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారని, ఇప్పుడు పెడన పట్టణంలో ఈ భారీ జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్న ఆ సంస్థ ప్రతినిధులను మంత్రి శ్రీ జోగి రమేష్ గారు ప్రత్యేకంగా అభినందించునట్లు మంత్రి గారి కార్యాలయం నుంచి వెలువడిన ప్రకటనలో వెల్లడించారు.
పెడన నియోజకవర్గ పరిధిలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని,జాబ్ ఫెయిర్ లో పాల్గొనే వారు www.apssdc.in వెబ్ సైట్ లో రిజిస్టర్ చేయడం లేదా 7981368429 / 9440444033 నంబర్లుకు కాల్ చేయవలసినదిగా మంత్రి గారి కార్యాలయ ప్రకటనలో వివరించారు.
Tags machilipatnam
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …