Breaking News

భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయండి… : జాయింట్ కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం కింద భూముల రీ సర్వే, ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్సకు సంబంధించి పెండింగులో వున్న భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అక్టోబర్ 12 వ తేదీ తుది గడువని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల సూచించారు. మంగళవారం మధ్యాహ్నం మచిలీపట్నం కలెక్టరేట్ స్పందన హాల్లో జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం, రీ సర్వే , వెరిఫికేషన్ , ఇళ్ల స్థలాలు తదితర అంశాలపై అన్ని మండలాల తాసిల్దారులతో జె సి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ ఎం. వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రాధికా, ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్స్ డిప్యూటీ తహసీల్దార్ సుభాష్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డా. మహేష్ కుమార్ రావిరాల మాట్లాడుతూ, భూకమతం ఒక సర్వే నంబర్‌ కింద ఉండి, కాలక్రమేణా విభజన జరిగి.. చేతులు మారినా సర్వే రికార్డులు అప్‌డేట్‌ కాకపోవడంతో వస్తున్న భూవివాదాలు, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఇబ్బందులకు ప్రభుత్వం ఇక చెక్‌ పెట్టనుందన్నారు. భూ రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రతి భూ కమతానికి (సబ్‌ డివిజన్‌కు కూడా) విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించనుందని తెలిపారు. ప్రతి భూ కమతానికి విడిగా అక్షాంశ, రేఖాంశాలు, విశిష్ట గుర్తింపు సంఖ్య, సమగ్రంగా భూ వివరాలు తెలిపే క్యూఆర్‌ కోడ్‌తో కూడిన భూపటాన్ని యజమానులకు జారీ చేస్తుందని దీంతో గ్రామ స్థాయిలోనే భూరికార్డులను క్రోడీకరించడం వల్ల మ్యాపులు (భూ కమతాలతో కూడిన గ్రామ పటం), ఇతర భూ రికార్డులు ఇక గ్రామాల్లోనే అందుబాటులో ఉంటాయని వివరించారు. .
కృష్ణాజిల్లాలో చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియను నిర్దేశిత గడువు లోగా వేగవంతంగా పూర్తిచేయాలని వివిధ డివిజన్ల ఆర్డీవోలకు అన్ని మండలాల తాసిల్దార్ లకు ఆయన సూచించారు.పిఓఎల్ఆర్ ( ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ) కు సంబంధించి పెండింగులో వున్న భూసేకరణను వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. రీ సర్వేలో 3 రకాలుగా తిరస్కరణలో జరుగుతున్నట్లుగుర్తించినట్లు చెప్పారు. సాదాబైనామా, గ్రామ పురోణిలు, పోతి కేసులు వంటివి తిరస్కరించినట్లు చెప్పారు. మొదటి విడతగా వచ్చిన 1050 , రెండవ విడతగా వచ్చిన 5 వేల భూమి హక్కు పత్రాలను వేగవంతంగా తనిఖీ చేయాలని జాయింట్ కలెక్టర్ రెవిన్యూ అధికారులను కోరారు. అలాగే, జిల్లాలో జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం కింద భూముల రీ సర్వే, పిఓఎల్ఆర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ కు సంబంధించి ఆరు మండలాలు 100 గ్రామాలకు 13 నోటిఫికేషన్ త్వరితగతిన పూర్తి చేసుకున్నామని, మిగిలిన గ్రామాలలో కూడా వెంటనే వేగవంతంగా పూర్తి చేయాలని తాసీల్ధారులను ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ మండలాల తహిసీల్దార్లు,విఆర్వో లు, మండల సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *