-అంబేడ్కర్‌కు ఘన నివాళులు.. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పిలుపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకుడు, సామాజికవేత్త, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేదర సురేష్ కుమార్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి దిక్సూచిగా, దేశ సమగ్రతకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిందని, 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందని తెలిపారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులు, విధులు, సమానత్వం, భావప్రకటనా స్వేచ్ఛ కల్పించిందన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించడమే రాజ్యాంగ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకుంటూ, పౌరులుగా మన బాధ్యతలను కూడా నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌తో పాటు రాజ్యాంగ నిర్మాణంలో భాగస్వాములైన మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.
