మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న స్వచ్చ సంకల్పం కార్యక్రమం ద్వారా గ్రామాలలో సంపూర్ణ పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు.
గురువారం మధ్యాహ్నం గ్రామ కంఠం, రీ సర్వే, జగనన్న స్వచ్చ సంకల్పం, ఉపాథి హామీ పథకం, పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి గ్రామ సచివాలయాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లు, రైతు భరోసా కేంద్రాలు, లేబర్ మొబలైజేషన్, ఏ ఎం సి యు, బి ఎం సి యు తదితర అంశాలపై విజయవాడ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో, సంబంధిత అధికారులతో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమీషనర్ కోనా శశిధర్ లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కృష్ణాజిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష కలెక్టరేట్ నుండి హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ…. గ్రామ కంఠoల రీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని, ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లు నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. గ్రామాలలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ద్వారా సంపూర్ణ పారిశుధ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ, జిల్లాలో గ్రామ సచివాలయాలు సెప్టెంబర్ మొదటి వారం నుంచి అక్టోబర్ చివరివారం వరకు 87 పురోగతిలో ఉన్నాయన్నారు, అక్టోబర్ 4వ వారం లో్పున 17 పురోగతిలో ఉన్నాయని అన్నారు. అలాగే రైతు భరోసాకేంద్రాలు సెప్టెంబర్ మొదటివారం నుంచి అక్టోబర్ చివరివారం వరకు 53 రైతు భరోసా కేంద్రాలు పూర్తయ్యాయని, అక్టోబర్ నెలలోనే 9 రైతు భరోసా కేంద్రాలు నిర్మించబడినట్లు తెలిపారు. వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ లకు గాను సెప్టెంబర్ మొదటివారం నుంచి అక్టోబర్ చివరి వారం వరకు 50 పూర్తికాబడ్డాయని, అక్టోబర్ నెలలోనే 16 వైయస్సార్ హెల్త్ క్లినిక్ లు నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని మిగిలిన వాటిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి నాణ్యతతో కూడిన నిర్మాణాలు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామ కంఠoల రీ సర్వే కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని, ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జలజీవన్ మిషన్ పథకంలో ఇంటింటికి కుళాయి కనెక్షన్లు తదితర పనులను నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని తెలిపారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా లక్ష్యాలను నిర్దేశించుకుని చెత్త సేకరణ, ప్లాస్టిక్ వ్యర్థాలను విడిగా చేయడం సంపద కేంద్రాల ఆదాయంపై తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, పి డి డ్వామా జీవి సూర్యనారాయణ, ఆర్ బ్ల్యూఎస్ అధికారి సత్యనారాయణ రాజు, జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరరావు నాయక్, పంచాయితీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …