విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతిష్టాత్మక ఆసియా కాంటినెంటల్ చెస్ ఛాంపియన్ షిప్ లో ఆంధ్రప్రదేశ్ కి చెందిన మహిళా గ్రాండ్ మాస్టర్ (డబ్ల్యూజీఎం) నూతక్కి ప్రియాంక అదరగొట్టారు. మహిళల విభాగంలో ప్రియాంక 65 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఈమె శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మరియు ఎండీ ఎన్ .ప్రభాకర రెడ్డి లను కలిశారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు, విదేశీ కోచ్ ద్వారా శిక్షణ తీసుకునేందుకు ఆర్థిక సహకారం అందించాలని కోరారు. శాప్ ఛైర్మన్, ఎండీ లు సానుకూలంగా స్పందించారు. అనంతరం ఘనంగా సత్కరించారు. త్వరలో శ్రీలంక, ప్యారిస్ లలో జరగనున్న పోటీల్లో విజయం సాధించడంతో పాటు మరిన్ని విజయాలు సాధించి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింప చేయాలని కోరారు.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …