ఈదుమూడి, కట్లపల్లి ( పెడన ), నేటి పత్రిక ప్రజావార్త :
వాలంటీర్ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో ప్రజలు అందరూ సులభంగానే ప్రభుత్వ సేవలను పొందుతున్నారని తద్వారా గ్రామీణాభివృద్ధి సాధ్యం అవుతుందని మహాత్మా గాంధీజీ చెప్పినట్లు పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలు అనే మాటలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్షరాల అమలు చేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ విశ్లేషించారు.
గురువారం ఉదయం ఆయన పెడన నియోజవర్గంలోని కొంకేపూడి,ఈదుమూడి, కట్లపల్లి గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎంతో చురుగ్గా పాల్గొని ఏకబిగిన మూడు గ్రామాల్లో 400 ఇళ్లను సందర్శించారు.
తొలుత ఆయన కొంకేపూడి గ్రామంలో చలపాటి ముసలయ్య, మోర్ల లక్ష్మి, ఉప్పలపాటి సోమయ్య, వీరంకి వనజక్షమ్మ, గరికిముక్కు నాగమణి, చుక్క జయరాజు, పల్లెకొండ కుమారమ్మ, జల్దుల వెంకటేశ్వరరావు, నందమూరి నాగమ్మ, తదితరుల ఇళ్లకు వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించారు. ఆయా కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాలు కనుక్కొని వారు ప్రభుత్వపరంగా పొందుతున్న సంక్షేమ పథకాలను చదివి వినిపించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాగిత నారాయణరావు, గంగమ్మ అనే వృద్ధ దంపతులు తమ కష్టాన్ని మంత్రికి చెప్పుకున్నారు. తమ పుత్రుడు మచిలీపట్నంలో ఒక రెస్టారెంట్లో పని చేస్తున్నాడని ఇటీవల ఉద్యోగం పోవడంతో మొత్తం కుటుంబ సభ్యులమంతా అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. ప్రభుత్వం ఇస్తున్న వృద్ధాప్య పెన్షన్ డబ్బులతో తమ జీవనం కడుభారంగా కొనసాగుతుందని, తమ కుమారుడు మచిలీపట్నంలోనే నివసిస్తున్నాడని చెప్పారు. వారి దుస్థితికి చలించిపోయిన మంత్రి జోగి రమేష్ తన వ్యక్తిగత కార్యదర్శి శివకు చెప్పి ఆ వృద్ధ దంపతులకు 5 వేల రూపాయల నగదు సహాయం అందజేశారు. అలాగే పలువురు చెప్పిన వివిధ సమస్యలు ఓపిగ్గా విని అక్కడే ఉన్న అధికారులకు చెప్పి వాటిని తక్షణమే పరిష్కరించాలని మంత్రి జోగి రమేష్ ఆదేశించారు.
అనంతరం కొంకేపూడి శివారు గ్రామాలైన ఈదుముడి కట్లపల్లి గ్రామాలకు కాలినడకన బయలుదేరారు. అంకేం వీర రాఘవమ్మ, మోదుమూడి చిన్న వెంకటేశ్వరరావు, పామర్తి వరలక్ష్మి, పరస నాగకుమారి, మోదుమూడి బాలచంద్రన్ నరసింహమూర్తి, పామర్తి కొండేశ్వరరావు, బుర్ర వెంకటేశ్వరమ్మ, రాజులపాటి శ్రీనివాసరావు, కాగిత అనసూయమ్మ తదితరులు ఇళ్లకు వెళ్లి వారికి అందిన ప్రభుత్వ పథకాల గూర్చి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, గతంలో ప్రజలు ప్రభుత్వ పథకాలు పొందాలంటే కార్యాలయాల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగేవారిని అయినా కూడా అధికారులు రిటైర్ కావాలే తప్ప అర్హులకు పథకాలు అందేవి కావన్నారు. నేడు ప్రభుత్వం ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను ఏర్పాటు చేసి అర్హులందరికీ సంక్షేమ ఫలాలు వారి ముంగిటకు చేర్చడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి అధికారులే ప్రజల వద్దకు వెళ్లాలి అనే లక్ష్యంతో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా ప్రజలకు అందించడంలో వాలంటీర్ల పాత్ర చాలా కీలకమైనదని అన్నారు
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో పాల్గొన్న పెడన మార్కెట్ కమిటీ చైర్మన్ గరికిపాటి చారుమతి రామానాయుడు, ఎంపీపీ రాజులపాటి వాణి అచ్యుతరావు, సర్పంచ్ దావు భైరవ లింగం, మండల పార్టీ అధ్యక్షుడు కొండవీటి నాగబాబు, కార్యదర్శి పామర్తి సాంబశివరావు, బీసీ సెల్ అధ్యక్షుడు బెజవాడ నాగబాబు, పెడన 3 వ వార్డు కౌన్సిలర్ బళ్ళా గంగయ్య,గూడూరు జడ్పిటిసి వేముల సురేష్, వైస్ ఎంపీపీ పరస రాజేష్, నడపూరు సర్పంచ్ సింగంశెట్టి రాంబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ లోయ ఆంజనేయులు, ఎంపీటీసీ సభ్యుడు దావు శ్రీనివాసరావు, కోడూరు శ్రీనివాసరావు, యుగంధర్, శొంఠి ప్రభుస్వామి, తమ్ము శ్రీనివాస్, పరస రాజేష్ స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …