Breaking News

విద్యార్థులలో శాస్త్రీయ పరిజ్ఞానం పెంచేందుకు సైన్స్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్నాం..

-సృజనాత్మకతతో కూడిన శాస్త్రీయ పరిజ్ఞానం అభివృద్ధికి దోహదపడుతుంది..
-రాష్ట్ర స్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌ పోటీలలో జిల్లాను అగ్రస్థానంలో నిలుపుదాం.
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సృజనాత్మకతతో కూడిన శాస్త్రీయ పరిజ్ఞానం విద్యార్థుల మానసిక అభివృద్ధికి దోహదపడుతుందని, సైన్స్‌ ఎగ్జిబిషన్లు నిర్వహించడం ద్వారా విద్యార్థులలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో భాగంగా విజయవాడ రూరల్‌ మండలం కొత్తూరు తాడేపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్‌ ఎగ్జిబిషన్‌ను మంగళవారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ప్రారంభించి విద్యార్థిని విద్యార్థులు రూపొందించిన సైన్స్‌ పరికరాలను తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రాధామిక స్థాయి నుండే విద్యార్థులలో విజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు ఆహ్లాదకరమైన అనుభూతిని కల్పించడానికి సైన్స్‌ ఎగ్జిబిషన్లు ఎంతో దోహదపడుతాయన్నారు.ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు జిల్లా, మండల రాష్ట్రా స్థాయిలలో సైన్స్‌ ఎగ్జిబిషన్‌ పోటీలను నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనపరచిన విద్యార్థులకు ప్రసంసా పత్రాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందన్నారు. జిల్లాలో నవంబర్‌ 22,23 తేదిలలో పాఠశాల స్థాయి, డిసెంబర్‌ 12,13 తేదిలలో మండల స్థాయి, జనవరి 27,28 తేదిలలో ఎకో ఫెండ్లీ మెటీరియల్‌, హెల్త్‌ అండ్‌ క్లీన్లీనెస్‌, సాఫ్ట్‌వేర్‌ అండ్‌ యాప్స్‌, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ క్లయిమెట్‌ చేంజస్‌, మాథమేటికల్‌ మోడలింగ్‌ అంశాలపై జిల్లా స్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా స్థాయి పోటీలలో ఉత్తమ పత్రిభ కనపరిచిన విద్యార్థులు ఫిబ్రవరి 27,28 తేదిలలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీలలో జిల్లాకు చెందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరిచేలా కృషి చేయాలని అధికారులకు సూచించామన్నారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని కల్పించి సరికొత్త ఆలోచనలతో సైన్స్‌ ఎగ్జిబిషన్లలో పాల్గొనేలా కృషి చేయాలన్నారు. సైన్స్‌ అండ్‌ టెక్నలజీ పై ఆసక్తిని పెంచుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం వుందన్నారు. విద్యార్థులలో సృజనాత్మక పత్రిభను వెలిక తీసేందుకు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించే సైన్స్‌ ఎగ్జిబిషన్‌లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు సూచించారు. విద్యార్థిని విద్యార్థులు రూపొందించి హ్యండ్‌ మేడ్‌, మైక్రోస్కోప్‌, ఫైబర్‌ రూట్‌ సిస్టమ్‌, టాప్‌ రూట్‌ సిస్టమ్‌, మ్యాజిక్‌ నీడిల్‌, వాటర్‌ సేవర్‌, సైర్చింగ్‌ రోబో, స్మార్టు ఎయిర్‌కూలర్‌, ఎలక్ట్రానిక్‌ వెయిట్‌ లిప్టర్‌, త్రిడి ప్రింటర్‌లను తిలకించి విద్యార్థుల నుండి వివరాలను అడిగి తెలసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ పాఠశాలలో పదొవ తరగతి విద్యార్థుల విద్యాప్రణామాలను పరిశీలించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాలల ఆవరణంలో ఆకు కూరలు, కూరగాయల మొక్కలను నాటి సంరక్షణ చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
కార్యక్రమంలో డిఇవో సి వి రేణుక, యంపిడివో భార్గవి, యంఇవో వెంకటరత్నం, జిల్లా సైన్స్‌ అధికారి హుస్సేన్‌, స్థానిక సర్పంచ్‌ ఉయ్యూరు గోపాలరావు, ప్రధానోపాధ్యాయుడు యం కమలకరావు,సైన్స్‌ టీచర్లు శ్యామెల్‌, డివి రమణమ్మ, రాంబాబు, పంచాయతీ కార్యదర్శి కె. మురళిమోహన్‌ తదితరులు ఉన్నారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *