విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని నియోజకవర్గానికి ఒక మెటీరియల్ రికవరీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు పంచాయతీరాజ్ కమీషనర్ కోన శశిధర్‌కు వివరించారు. మెటీరియల్ రికవరీ యూనిట్ల ఏర్పాటు, జగనన్న స్వచ్ఛ సంకల్పం, స్వమిత్వ సర్వే తదితర అంశాలపై పంచాయతీరాజ్ కమీషనర్ కోన శశిధర్ జిల్లా కలెక్టర్లుతో గురువారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయ వీడియోకాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలలో ఎస్‌డబ్ల్యుపిసిలను ఏర్పాటు చేయడం జరిగిందని, విసన్నపేట మండలం లంబాడిపేట, వత్సవాయి మండలం రామచంద్రపురం, కంచికచర్ల మండలం గనిఆత్కూరు, విజయవాడ రూరల్ మండలం రామరాజనగర్‌లలో ఎస్‌డబ్ల్యుపిసి ఏర్పాట్లలో ఎదురైన స్థల సమస్యలను పరిష్కరింస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. గ్రామలలో సేకరించిన వ్యర్థాలలో ఎస్‌డబ్ల్యుపిసిల వద్ద ప్లాస్టిక్ వ్యర్థలను వేరు చేసి వాటిని మెటీరియల్ రికవరీ యూనిట్‌కు తరలించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన మెటీరియల్ రికవరీ యునిట్ల వద్ద ప్లాస్టిక్ షెష్టర్లను ఏర్పాటు చేసి పాలిథిన్ ప్లాస్టిక్‌లను చిన్న ముక్కలుగా కట్‌చేసి వాటిని పంచాయతీరాజ్ ఆర్‌అండ్‌బి నేషనల్ హైవే అధికారుల ద్వారా బిటి రోడ్లలో నిర్మాణంలో వినియోగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామీణ ప్రణాళిక కోసం ఖచ్చితమైన భూ రికార్డులను రూపొందించేందుకు ఆస్తికి సంబంధించిన వివాదలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వమిత్వ సర్వే పనులు త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డిల్లీరావు పంచాయతీ రాజ్ కమీషనర్‌కు వివరించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, డ్వామా పిడి జె.సునీత, పంచాయతీరాజ్ ఇఇ ఏ వెంకటేశ్వరరావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ వెంకటరమణ తదితరులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …