Breaking News

మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటేనని నమ్మన వ్యక్తి జ్యోతిరావు పూలే…

-మహాత్మ పూలే ఆలోచనలు ఆశయాలు నేటి తరానికి ఆదర్శం..
-మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జోగిరమేష్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామాజిక న్యాయం మహిళా అభ్యున్నతికై పోరాడిన తత్వవేత్త విద్యావేత్త మహాత్మ జ్వోతి రావు పూలే చిరస్మరణీయుడని, ఆయన ఆశయాలు, ఆలోచనలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగిరమేష్‌లు అన్నారు.
మహాత్మ జ్యోతి రావు పూలే 132వ వర్థంతిని పురస్కరించుకుని నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద సోమవారం ఉదయం మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగిరమేష్‌, శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌రావు, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జ్యోతి రావు పూలే కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మట్లాడుతూ నేడు సమాజంలో మహిళలు అన్ని రంగాలలో ముందుండేందుకు కారణం మహాత్మ జ్యోతి రావు పూలే ఆలోచన విధానాలేనన్నారు. మహిళలు పురుషులతో పాటు సమాన హక్కు పొందాలంటే అది విద్య ఒక్కటే మార్గమని మహాత్మ జ్యోతి రావు పూలే నమ్మకమన్నారు. తన భార్య విద్యను అభ్యసించేలా ప్రోత్సహించడంతో ఆమె దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా కాకలిగారన్నారు. హిందు సామాజం సరస్వతి దేవిని విద్య దేవతగా ఉహించి ఆరాధిస్తే, సరస్వతి బాయి పూలేను ప్రత్యక్షంగా ఆధారిస్తారన్నారు. బలహీన వర్గాల ప్రజలు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు మార్గ నిర్థేశం చేసిన మహోన్నత వ్యక్తి పూలే అన్నారు. ఆయన అడుగుజాడలలో పయనిస్తూ జ్యోతిరావు పూలే ఆశయాలను ఆచరణలో పెట్టి బలహీన వర్గాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద పీట వేస్తున్నారన్నారు. బలహీన వర్గాల ప్రజలు అన్ని రంగాలలో రాణించాలనే ఆలోచనతో 50 శాతం పదవులు ఆయా వర్గాలకు కేటాయించి ప్రోత్సహిస్తున్నారన్నారు.
గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగిరమేష్‌ మాట్లాడుతూ బలహీన వర్గాల ప్రజలలో వెనుకబాటు తరాన్ని పారద్రోలి అన్ని రంగాలలో ముందుండే విధంగా ప్రోత్సహిస్తున్న ఎకైక ముఖ్యమంత్రి వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినవ పూలేగా బలహీన వర్గాల హృదయాలలో నిలిచారన్నారు. విద్యారంగంలో సంస్కరణలు తీసుకువచ్చి మహాత్మ పూలే ఆశయాలను నేరవేర్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. సమాజంలో ఆర్థిక అసమానతలను రూపుమాపి మహిళలు ఉన్నత చదువులు చదవాలనే పూలే ఆకాంక్షలను నేటి ముఖ్యమంత్రి నేరవేర్చుతున్నారన్నారు.
జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు మాట్లాడుతూ మహాత్మ అనే పదం మహోన్నతమైన వ్యక్తులకే చెల్లుతుందన్నారు. 18వ శతాబ్దంలోనే జ్యోతిరావు పూలేను మహాత్మ అని పిలుచుకేనేవారని అనంతరం జాతి పిత గాంధీని మహాత్మ అని పిలుచుకోవడం జరిగిందన్నారు. జ్యోతి రావు పూలే ఆలోచనలు, ఆశయాలను, ఆదర్శంగా తీసుకుని డా. బి ఆర్‌ అంబేద్కర్‌ భారత రాజ్యంగానికి రూపకల్పన చేశారన్నారు. నేటి తరానికి పూలే ఆశయాలు నిలుస్తాయని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
కార్యక్రమంలో జాయింట్‌కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌ కుమార్‌, బిసి సంక్షేమ శాఖ డైరెక్టర్‌ బి అర్జున్‌రావు, జాయింట్‌ డైరెక్టర్‌ తనూజరాణి, డిప్యూటి డైరెక్టర్‌ సిహెచ్‌. లక్ష్మి దుర్గ, డిప్యూటి మేయర్‌ బెల్లం దుర్గ, అవుతు శైలజరెడ్డి, బిసి సంఘ నాయకులు పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *