Breaking News

వెహికల్ డిపో లో జరుగుతున్న ఆధునీకరణ పనుల పరిశీలన సత్వరమే పూర్తి చేయాలి…

-అధికారులకు ఆదేశాలు – కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హనుమాన్ పేట నందలి వెహికల్ డిపో ఆధునీకరణ పనుల పురోగతిని నగరపాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. డిపో ఆవరణలో చేపట్టిన పనులు వేగవంతము చేసి సత్వరమే పూర్తి చేయాలని ఆదేశిస్తూ, నూతనంగా నిర్మించిన మెకానికల్ షెడ్ నందలి ఫ్లోరింగ్ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా వాహనములు సర్వీసింగ్ చేయు ప్రాంతములో మట్టి, వ్యర్ధములతో ఆశుభ్రముగా ఉండుట గమనించి పరిసరాలు అన్నియు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తూ సర్వీస్ పాయింట్ వద్ద డస్ట్ బిన్ ఏర్పాటు చేసుకొని వాహనములు సర్వీస్ చేసిన వెనువంటనే వచ్చు వ్యర్ధములను అన్నియు డస్ట్ బిన్ లందు వేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్బంలో నూతనముగా కొనుగోలు చేసి డిపోలో ఉన్న నాలుగు TATA 407g SFC CNG టిప్పర్ వాహనములను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. డిపో కు వచ్చు ప్రధాన ద్వారం వద్ద ఏవిదమైన వాహనములు పార్క్ చేయకుండా చూడాలని అన్నారు. పర్యటనలో వెహికల్ డిపో DE ప్రవీణ్ చంద్ర, AE యేసుపాదం మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *