Breaking News

ట్యాబ్‌లను ప్రతీ విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద విద్యార్థులకు సైతం డిజిటల్‌ విధానంలో విద్యను అందుబాటులో తెస్తూ పాఠ్యంశాలను మరింత సులభంగా అర్థమయ్యే రీతిలో రూపొందించిన ట్యాబ్‌లను ప్రతీ విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులకు బైజూస్‌ ఫ్రీలోడెడ్‌కంటెంట్‌తో రూపొందించిన శామ్‌సంగ్‌ ట్యాబ్‌ల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాపట్ల జిల్లా, చుండూరు మండలం యడ్లపల్లిలో లాంఛనంగా ప్రారంభించారు.
నగరంలోని సత్యనారయణపురం ఎకెటిపి ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఉచిత ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు సెంట్రల్‌ శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌ ముఖ్య అతిధులుగా హాజరై విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యావిధానంలో సంస్కరణలను తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు కార్పొరేట్‌ విద్యా సంస్థలకు ధీటుగా అన్ని మౌలిక వసతులు, విద్యా బోదన కల్పిస్తుందన్నారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, అమ్మఒడి వంటి పథకాలకు రాష్ట్ర వ్యాప్తంగా 688 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందన్నారు. విద్యారంగంలో చదువుతో పాటు సాంకేతికంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. పాఠ్యాంశాలు విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో వీడియో, ఆడియో, త్రీ డైమన్షన్‌తో బోధన జరుగుతుందన్నారు. ఈ సాంకేతికతను ప్రతీ పేద విద్యార్థికి చేరువ చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 16 వేల 500 విలువ గల ట్యాబ్‌, 15 వేల 500 విలువ గల కంటెంట్‌తో కలిపి 32 వేల లబ్ధిని, 13,268 రూపాయల విలువతో ట్యాబ్‌లను ఉచితంగా అందిస్తున్నారన్నారు. జిల్లాలో 8వ తరగతి చదువుతున్న 13,947 మంది విద్యార్థులు, 4,279 మంది ఉపాధ్యాయులకు 24 కోట్ల 18 లక్షల 22 వేల 568 రూపాయల విలువ చేసే ట్యాబ్‌లను అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం సాంకేతికంగా మెరుగైన విద్యా విధానాన్ని అందించేందుకు అందిస్తున్న ఈ ట్యాబ్‌లను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ప్రపంచ దేశాల విద్యార్థులతో పోటీ పడే విధంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
స్థానిక శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌ మాట్లాడుతూ సెంట్రల్‌ నియోజకవర్గ పరిధిలో 15 పాఠశాల 8వ తరగతి చదువుకుంటున్న 1,655 మంది విద్యార్థులకు లబ్ది చేకూరనున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ గత మూడున్నరేళ్ళలో విద్యా వ్యవస్థలో అనేక పథకాలను తీసుకువచ్చి ప్రతీ పేద విద్యార్థి కార్పొరేట్‌ స్కూల్‌ విద్యార్థులతో పోటీ పడే విధంగా అనేక మార్పులు తీసుకువచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న గోరు ముద్ద, నాడు-నేడు, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ వంటి పథకాలకు 54 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశామన్నారు. అమ్మఒడి పథకం ద్వారా సుమారు 20 వేల మంది విద్యార్థు తల్లుల ఖాతాలలో మూడున్నరేళ్ళలో 112 కోట్లు జమ చేశామన్నారు. ఎకెటిపి ఉన్నత పాఠశాలను మోడల్‌ స్కూల్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌ అన్నారు.
కార్యక్రమంలో డిప్యూటి మేయర్‌ అవుతూ శైలజారెడ్డి, డిఇవో సివి రేణుక, కార్పొరేటర్లు, విద్యార్థులు ఉన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *