అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం పూర్వ విద్యార్థుల ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశము జరిగినది దీనికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ పట్టేటి అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో ఎయిర్ వైస్ మార్షల్ జె రాజేంద్ర, శ్రీ కిరణ్ COO COMAKEIT లు ఆన్లైన్లో సమావేశమయ్యారు. ప్రొఫెసర్ వైఎస్ కిరణ్మయి డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్, డాక్టర్ సయ్యద్ వలి ఇండస్ట్రియల్స్ట్ మరియు యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, రిజిస్ట్రార్ PROF. కరుణ ,ప్రొఫెసర్ సరస్వతీ రాజు ప్రొఫెసర్ గంగాధర్ రావు, Prof. నాగరాజు, డాక్టర్ పద్మావతి లు ఈ సమావేశమునకు హాజరయ్యారు. విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సంఘ సంచాలకులు డాక్టర్ జి వి ఎస్ ఆర్ ఆంజనేయులు ఈ సమావేశమును సమన్వయ పరిచారు.పూర్వ విద్యార్థుల సంఘం తరఫున తీసుకున్న కొన్ని కార్యక్రమాలను సమావేశంలో తెలియజేశారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా కోర్సులు చేయదలచిన పూర్వ విద్యార్థులకు ఫీజులు రాయితీ ఇవ్వన్నారని విశ్వవిద్యాలయ లైబ్రరీ ద్వారా INFILIBINET సౌకర్యాన్ని అందజేయటానికి కూడా యూనివర్సిటీ సన్నద్ధతను తెలియజేశారు తమ తమ ప్రస్తుత ఉద్యోగ అభివృద్ధికి తోడ్పడే ఒక సాఫ్ట్వేర్ను రూపొందించినట్టు త్వరలో ఆ సాఫ్ట్వేర్ తో ప్రస్తుతం వివిధ రంగాలలో ఉద్యోగం చేస్తున్న వారికి వారి ఉద్యోగ అభివృద్ధికి తోడపడటానికి అవకాశాలను ఈ సాఫ్ట్వేర్ లో పొందుపరుస్తున్నట్లు, ఆయన తెలియజేశారు.
పూర్వ విద్యార్థుల సహాయ సహకారులతో ప్రస్తుత విద్యార్థులకు- విశ్వవిద్యాలయం తరఫున పూర్వ విద్యార్థులకు సహాయ సహకారాలు అందించుకోవడానికి పూర్వ విద్యార్థుల సంఘం ఒక వేదికగా ఉంటుందని ఆంజనేయులు తెలియచేశారు
పూర్వ విద్యార్థుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్ టెక్నాలజీల వంటి అత్యాధునిక విషయపరిజ్ఞానాన్ని ప్రస్తుత విద్యార్థులకు పూర్వ విద్యార్థులు అందజేయాలని విసి ప్రొఫెసర్ రాజశేఖర్ అన్నారు. ఎయిర్ వైస్ మార్షల్ జె రాజేంద్ర విశ్వవిద్యాలయం తీసుకుంటున్న పలు చర్యలను నూతన కోర్సులను ప్రవేశపెడుతూ విద్యార్థులకు నూతన నైపుణ్యాలను పరిచయం చేయాలని ఆయన అన్నారు. శ్రీ కిరణ్ మధునా పంతుల ను ఆదర్శంగా తీసుకొని మరి కొంతమంది పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి విశ్వవిద్యాలయంలోని విభాగాలకు, విద్యార్థులకు ఆర్థికంగా, నైపుణ్యపరంగా సహాయపడుతూ వారి వారి ఉద్యోగాన్వేషణలో సహాయ సహకారాలు అందించాలని కోరారు. Prof. కిరణ్మయి మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా పూర్వ విద్యార్థులు విశ్వవిద్యాలయమునకే కాక సమాజానికి కూడా సహాయం చేయాలని అన్నారు. రిజిస్ట్రార్ Prof. కరుణ తమ ప్రసంగంలో పూర్వ విద్యార్థుల డేటాను సమీకరించి ఈ విషయములన్నీ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న నైపుణ్యాభివృద్ధి ప్లేస్మెంట్స్ విషయ పరిజ్ఞానం కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివి అందరికీ అందేటట్లుగా కృషి చేయాలని అన్నారు. డాక్టర్ సయ్యద్ వలి సైన్స్ విభాగాలలోని పరిశోధనాశాలలను మరింత అభివృద్ధి చేయడానికి పూర్వ విద్యార్థులు ముందుకు రావాలని సూచించారు. త్వరలో విశ్వవిద్యాలయంలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంతో సమన్వయం ఏర్పరచుకొని పూర్వ విద్యార్థుల సంఘం తరఫున ఇంక్యుబేటర్ ప్రారంభించడానికి పూర్వ విద్యార్థులు ముందుకు వంచి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ రాజశేఖర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం తరఫున ఇంక్యుబేటర్ సెంటర్ ను ప్రారంభించడానికి కావలసిన మౌలిక వసతులను విశ్వవిద్యాలయం కల్పిస్తుందని యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడానికి వారికి కావలసిన సాంకేతిక విషయ పరిజ్ఞానాన్ని అందివ్వటానికి పూర్వ విద్యార్థుల ముందుకు రావాలని కోరారు. తదుపరి విశిష్ట పూర్వ విద్యార్థులు ను అయినా ప్రొఫెసర్ కిరణ్మయి, prof. బి. కరుణ గారిని,
ప్రో. గంగాధర రావు గారి నీ డాక్టర్ సయ్యద్ వలీని డాక్టర్ పద్మావతిని, విశ్వవిద్యాలయం వారు సన్మానించారు. ఆన్లైన్ ద్వారా ప్రసంగించిన వారికి కూడా విశ్వవిద్యాలయం తరఫున ధన్యవాదాలు తెలియజేశారు పూర్వ విద్యార్థుల సంఘ కార్యదర్శి డైరెక్టర్ అయిన prof. జీవిఎస్ఆర్ ఆంజనేయులు వందన సమర్పణ తో సభ ముగిసింది.
Tags amaravathi
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …