Breaking News

కలలు కనాలి.. వాటిని సాకారం చేసుకోవడానికి కష్ట పడాలి

-డిజిటల్ రూపంలో మెరుగైన బోధన పద్ధతులు
-ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం
-రాగి జావ వలన మంచి పోషకాలు అందుతాయి
-జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానం లో నూతన ఆవిష్కరణలు చేపట్టడం ద్వారా విద్యార్థులకి మరింత నాణ్యమైన విద్యను అందించడం జరుగుతోందనీ జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.

మంగళవారం బొమ్మురు జెడ్పీ హై స్కూల్ ను కలెక్టర్ సందర్శించి మధ్యాహ్న భోజన పథకం, డిజిటల్ తరగతి బోధన పద్ధతులను పరిశీలించి విద్యార్థులతో ముఖాముఖి సంభాషించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, మెరుగైన విద్యను అందించే క్రమంలో ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, సకాలంలో అందచేయ్యాడం జరుగుతోందని పేర్కొన్నారు. నాణ్యమైన బోధన పద్ధతులు, డిజిటల్ 10 వ తరగతి పిల్లలకు డిజిటల్ రూపంలో బోధన చేస్తున్నట్లు తెలిపారు. జీవితంలో ప్రతి ఒక్కరూ లక్ష్యాలను సాధించడానికి అనుగుణంగా ప్రణాళిక, అమలు చేయడం కోసం కష్ట పడటం కూడా చాలా ముఖ్యం అన్నారు. అంతర్జాతీయ విధానంలో డిజిటల్ రూపంలో తరగతి గదు లను ఆదినికరించడం జరిగిందన్నారు. నేడు అంతర్జాల వ్యవస్థ అందుబాటులో ఉన్నాయని, వాటి సాంకేతికత ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లక్ష్యాలను సాధించడానికి అనుగుణంగా తల్లి తండ్రుల పిల్లల ఆలోచనలు గుర్తించి ప్రోత్సహం అంద చెయ్యవలసి ఉంటుందని, పిల్లలు కూడా సవాళ్లు ను ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉండాలి అప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించడానికి సాధ్యం అవుతుందని పేర్కొన్నారు.

గతంలో రాగులు జొన్నలు సజ్జలు వంటి ఆహార అలవాట్లు కేవలం పేద కుటుంబం వారి కోసం మాత్రమే అనే అపోహ ఉండేదని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత తెలియ చేశారు. నేడు ఆరోగ్యం పట్ల ప్రజల్లో స్పృహ కలిగి ఎన్నో పోషక విలువలు కలిగిన చిరుధాన్యాలు నిత్యం ఆహారం లో తీసుకోవడం జరుగుతోందని తెలియ చేశారు. పిల్లలు కూడా మంచి పోషకాలు తో కూడిన రాగి జావ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. పిల్లల్లో ఉండే బలహీనత లను అధిగమించి, చక్కటి శారీరక పెరుగుదల, వికాసము పెంపొందించడం కోసం స్కూల్స్ లో ఉదయం పూట రాగీ జావ అందిస్తున్నామని తెలిపారు. చక్కటి పోషకాలతో నిండిన రాగి జావ తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. మరింత మెరుగైన పోష్టిక ఆహారం అందించే సామర్థ్యం పెంచే క్రమంలో సూచనలు సలహాలతో ముందుకు రావాలని ఆమె కోరారు. మధ్యాహ్న భోజన పథకం కింద వారంలో ఆరు రోజులు మంచి పోషక విలువలతో కూడిన ఆహారం ఇవ్వడం కోసం ప్రత్యేక మెనూ ప్రకారం అందిస్తున్నట్లు తెలిపారు.

మధ్యాహ్న భోజన పదార్ధాలను రుచి చూసిన కలెక్టర్, అనంతరం స్కూల్ ఆవరణలో జరుగుతున్న నాడు నేడు పనులను పరిశీలించడం జరిగింది.

కలెక్టర్ వెంట డి ఈ ఓ ఎస్. అబ్రహం, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *