Breaking News

అందరికీ సంక్షేమం అందిస్తున్నాం : హోం మంత్రి తానేటి వనిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను లబ్ధిదారులకు నేరుగా అందిస్తున్నామని రాష్ట్ర హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని, ఏ ఊరికి రమ్మన్నా వచ్చి అక్కడ ప్రభుత్వ పథకాలు చూపిస్తానని అన్నారు. చాగల్లు మండలం దారవరం గ్రామంలో బుధవారం జరిగిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వాలంటీర్లకు సన్మానం, మిగిలిపోయిన లబ్ధిదారులకు ఇంటి పట్టాల పంపిణీ, వర్షాలకు దెబ్బతిన్న ఇంటి బాధిత కుటుంబానికి ఆర్థికసాయం వంటి కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొని వారికి అండగా నిలిచారు.
బుధవారం హోంమంత్రి తానేటి వనిత బీజీ బీజీ షెడ్యూల్ తో జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గం అంతా పర్యటించారు. అటు స్థానిక ప్రజా ప్రతినిధుల ప్రైవేట్ ఫంక్షన్లకు హాజరవ్వడంతో పాటు పలు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లోను పాల్గొన్నారు. ఉదయం రాజమహేంద్రవరంలో ‘బంగారు కొండ’ జిల్లాస్థాయి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని అనంతరం చాగల్లు మండలం దారవరం గ్రామం చేరుకున్నారు. అక్కడ ‘వాలంటీర్ల వందనం’కార్యక్రమం ద్వారా సేవా మిత్ర అవార్డులు అందుకున్న 12 మంది వాలంటీర్లను హోంమంత్రి సత్కరించారు. దారవరం గ్రామంలో విశిష్ట ప్రతిభ కనబర్చిన వాలంటీర్లు తానింకి కవిత, మద్దుకూరి శ్రీదేవి, గుమ్మపు ఇందిర లకు మొదటి, రెండో, మూడో బహుమతులుగా గోల్డ్ కాయిన్స్ ను అందజేశారు. గ్రామంలో ఇళ్లు, ఇళ్ల స్థలాలకు మిగిలి ఉన్న అర్హులు ముగ్గురికి ఇళ్ల పట్టాలు అందజేశారు. నందిగం వెంకట అలివేలు లక్ష్మి (భర్త సుబ్రహ్మణ్యం), నందిగం శివ లక్ష్మి తులసి దేవి (భర్త దుర్గా కోటేశ్వరావు), వెల్దుర్తి శాంతి (భర్త వీర్రాజు) లకు హోం మంత్రి చేతులు మీదుగా ఇళ్ల పట్టాలను అందుకున్నారు. అలాగే ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పెంకుటిల్లు పైకప్పు జారిపోవడంతో జంగం నాగమణి (భర్త రాజు (లేటు)) ఆర్థిక ఇబ్బంది పడుతున్న విషయం హోంమంత్రి దృష్టికి గ్రామ సర్పంచ్ మద్దుకూరి రవి ప్రసాద్ తీసుకువచ్చారు. దీంతో వెంటనే ఆ బాధిత కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్థికసాయం, బియ్యం, నిత్యావసర సరుకులు, కాయ కూరలు పంపిణీ చేసి ఆమె ఔనత్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. అర్హులైన వారంద‌రికీ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందుతున్నాయని, భార‌త‌దేశంలో ఎక్క‌డా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తమదేనని ఆమె తెలియజేశారు. గ్రామంలో, నియోజకవర్గంలో అందరినీ హోంమంత్రి ఆప్యాయంగా పిలిచి వారి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మండుటెండలో కూడా హోంమంత్రికి అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మద్దుకూరి రవి ప్రసాద్, ఎంపీటీసీ ఉబా భాగ్యవతి, ఉప సర్పంచ్ మద్దాల మోషే, జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆత్కూరి దొరయ్య, మాజీ ఎంపీటీసీ కట్టా వెంకటేశ్వరరావు, లకంసాని సూర్య ప్రకాశ రావు, ఉండవల్లి వెంకటేశ్వర రావు, చాగల్లు ఎంపీడీవో, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *