అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పద్మభూషణ్ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి తిరునక్షత్ర (పుట్టినరోజు) మహోత్సవాలు ఈ నెల 12వ తేదీ నుండి 16 వరకు సీతానగరంలోని జీయర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వేద విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్నట్లు అహోబిల రామానుజ జీయర్ స్వామి, దేవనాథ రామానుజ జీయర్ స్వామి శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి తిరునక్షత్ర సందర్భంగా 12న సీతానగరంలో ఉదయం 11:00 గంటలకు తీర్థగోష్టి, నగర సంకీర్తన, సాయంత్రం స్వామివారి అనుగ్రహ సంభాషణ, 13న ఘనాపాటీలకు జీయర్ అవార్డులు పంపిణీ, 14న శ్రీరామపాదుక ఆరాధన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 15న వేద విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం, సహస్ర కలశాభిషేక అంకురార్పణ, 16వ తేదీ సహస్ర 30వ కలశాభిషేక పండుగ, జీయర్ స్వామి వారి ఆశీర్వచనాలు ఉంటాయన్నారు. 14, 15, తేదీలలో రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు కేఎల్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 14వ తేదీ స్కూల్, కాలేజ్ విద్యార్థులచే శ్రీరామ పాదుకా పట్టాభిషేకం ‘ఆచార్య సేవ’ కార్యక్రమం విజయవాడ ‘ఎ’ కన్వెన్షన్ హాలు నందు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి, ఆశీర్వాదం పొందాలని కోరారు. అనంతరం ఉత్సవానికి సంబందించిన ఆహ్వానపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జీయర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రతినిధులు గోకరాజు గంగరాజు, అప్పారావు, చలసాని ఆంజనేయులు, ఆశ్రమ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు, కూర్మనాథాచార్యులు, రఘునాధాచార్యులు, ముక్కాముల అప్పారావు, రఘునాథ్, భుస్కి మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …