Breaking News

ఘనంగా పర్యాటక దినోత్సవం వేడుకలు

-దేశ ఆర్థిక వ్యవస్థ, సాంస్కృతిక రంగాలలో పర్యాటక శాఖను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది : పర్యాటకశాఖ రీజనల్ డైరెక్టర్
-ఉపాధి మరియు వ్యవస్థాపకతను పెంపొందించడం లో పర్యాటక శాఖ పాత్ర గణనీయమైనది
-పర్యాటక రంగం యూత్ క్లబ్ లను గురించి అవగాహన కల్పించాలి : వైస్ ఛాన్స్లర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, సాంస్కృతిక రంగాలలో పర్యాటక శాఖను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని పర్యాటకశాఖ రీజనల్ డైరెక్టర్ రమణా ప్రసాద్ అన్నారు. బుధవారం స్థానిక పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం నందు జాతీయ పర్యాటక దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందుగా జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం 7 గంటలకు స్థానిక మహతి ఆడిటోరియం నుండి  పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం వరకు 2 కె రన్ కార్యక్రమంను జిల్లా రెవెన్యూ అధికారి పెంచల్ కిషోర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్థానిక  పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలోనీ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ భారతి , పర్యాటకశాఖ రీజనల్ డైరెక్టర్ రమణా ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథరెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా పర్యాటకశాఖ రీజనల్ డైరెక్టర్ మాట్లాడుతూ.. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, సాంస్కృతిక రంగాలలో పర్యాటక శాఖ ప్రముఖమైందని తెలిపారు. పర్యాటక శాఖ గురించి అవగాహన కలిగి సంస్కృతులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించే ప్రయాణకుల పట్ల సానుకూలంగా సహకరించడంలో పర్యాటక శాఖ ప్రముఖ పాత్ర పోషిస్తుంది అని అన్నారు. పర్యాటకులకు మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి సేవతో పాటు పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం మరియు ప్రైవేటు కార్యకలాపాలలో పర్యాటక రంగం ప్రోత్సహిస్తుందన్నారు. జిల్లాలోని గండికోట, మైపాడు బీచ్, లంబసింగి వంటి వివిధ పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పర్యాటక అభివృద్ధి కోసం జిల్లాలో యువ టూరిజం క్లబ్ లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ.. ఉపాధిని అందించడం మరియు వ్యవస్థాపకతను పెంపొందించడం కోసం పర్యాటక రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి పర్యాటక రంగం యొక్క ప్రాముఖ్యత మరియు సామాజిక, ఆర్థిక, రాజకీయ మరియు సాంస్కృతిక విలువలపై సమాజంలో అవగాహన పెంపొందించడానికి నేడు జాతీయ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. పర్యాటక రంగం యొక్క ప్రచారం, యువ టూరిజం క్లబ్ లను గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని తెలిపారు. హాస్పిటాలిటీ సెక్టార్‌లో నైపుణ్యం కలిగిన టూరిస్ట్ గైడ్‌లుగా మరియు వాలంటీర్లుగా విద్యార్థులను తీర్చిదిద్దడo చాలా అవసరం అన్నారు. ప్రతి కళాశాల మరియు పాఠశాల ఒక ప్రత్యేక టూరిజం క్లబ్‌ను ఏర్పాటు చేసి క్లబ్‌ల పనితీరుపై బాధ్యత వహించేలా ఫ్యాకల్టీ మరియు స్టూడెంట్ కో-ఆర్డినేటర్ లను ప్రోత్సహిస్తామనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ.పి.టూరిజం రీజనల్ డైరెక్టర్ రమణా ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ రెడ్డి , విశ్వవిద్యాలయం అధ్యాపకులు విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *