అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల షెడ్యూల్ విషయంలో రాజకీయ నాయకుల లెక్క మారింది పోలింగ్ తేదీకి మే 31 కి చాలా గడువు ఉండడంతో బాబోయ్! ఇన్ని రోజులా? అని రాజకీయ పార్టీలు అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. ప్రస్తుతం ఎన్నికలంటే ఖర్చుతో కూడుకున్నపని. విస్త్రత ప్రచారం చేయాలి. రెండు నెలల పాటు ఓటర్ల చుట్టూ తిరగాలి.. దానికి మందీ మార్బలం ఉండాలి. అంతా డబ్బుతోనే పని. ప్రచారానికి అవసరమైన సరంజామా ఏర్పాటు చేసుకోవాలి. కార్యకర్తలు, ప్రచారం చేసేవారు కావాలి. ప్రతీ వార్ఢు ఊళ్లలోనూ ప్రచారం చేసేవారు కావాలి. ఎన్నికల కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. వాటిని నిర్వహించేవారు కావాలి. ప్రచార రథాలు, ఇతర వాహనాలు అవసరం. ఓటర్ల కోసం ఇంటింటా సర్వే కూడా చేస్తుంటారు. ఈ సర్వే కోసం పెద్ద టీమ్ అవసరం. జిల్లాలో ఒక నియో జకవర్గంలో కేవలం ఇంటింట ఓటర్ల సర్వే చేసి పార్ట్టీ మేనిఫెస్టో కరపత్రాలు, బ్యాడ్జీలు, స్టిక్కర్లు ఇవ్వడానికి 1000 మంది అవసరం. రోజూ వారి మంచిచెడ్డలు చూడాలి. ఇటీవల పెడుతున్న మీటింగ్‌లకు డబ్బులు ఇవ్వాల్సి వస్తోంది. రెండు మూడు గంటలు ఉండడానికి కనీసం రూ.150 నుంచి రూ.200 వరకూ ఇస్తున్నారు. గతంలో అయితే నాయకులు ఎక్కడైనా సభ పెడితే స్వచ్ఛందంగా వచ్చేవారు. అయితే ప్రస్తుతం 100% డబ్బుతోనే పని. కేవలం ఓటరు దగ్గరకు వెళ్లినప్పుడు అభ్యర్థి ఒక్కరే వెళితే బాగోదు, 15- 20 మంది అయినా వెంట ఉండాలి. బాగోగులు అంతా అభ్యర్థి జేబు నుంచే రావాలి. వెంట తిరిగేవారి పెట్రోల్ ఖర్చులు.. భోజనాలు. ఇలా అనేక సమస్యలు ఉంటాయి. అన్నీ పోను అన్ని వర్గాలను ఆకట్టుకోవాలి. వారిలో పలుకుబడి ఉన్నవారిని, పార్టీ కోసం పనిచేసే వారి ఆలనాపాలనా కూడా చూస్తుండాలి. ఇలా రోజుకే రూ.లక్షల్లో ఖర్చు ఉంటుంది. నోటిఫికేషన్ జారీ నుంచే అసలు ఘట్టం మొదలవుతుంది. నామినేషన్లు మొదలైన నాటినుండి మొదలవుతుంది. ఈ ఏడు ఎండలు వేడిగాల్పులు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇన్నాళ్ళు A.Cలలో సుఖంగా ఉండి చెమటలతో లోలోన పడుతున్న బాథ అసహనం పైకి కానరానీయకుండా ప్రజల వద్దకెళ్ళాలంటే కష్టమే మరి! అని ప్రజలు అనుకొంటున్నారు.
Tags vijayawada
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …