గురు రాందాస్ జీ మహారాజ్ 492వ జయంతి వేడుకల్లో పాల్గొన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త:
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ డివిజన్ శ్రీ గురు రాందాస్ జీ నగర్‌లో నిర్వహించిన శ్రీ గురు రాందాస్ జీ మహారాజ్ 492వ జయంతి వేడుకలకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్  హాజరయ్యారు. ఈ సందర్భంగా మహారాజ్ కి ఘనంగా నివాళులర్పించి, ఆయన బోధనలు, సేవా స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ, గురు రాందాస్ జీ మహారాజ్ చూపిన సేవా మార్గం, సమానత్వం, మానవతా విలువలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందిస్తూ మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గురు రాందాస్ జీ భక్తులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.