Breaking News

ఫ్రైడే డ్రై డే సందర్భంగా ఆకస్మిక తనిఖీలు చేసి ప్రజల్లో అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

-ప్రతి ఒక్కరూ వారి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
-మురుగు నీటి నిలువ, డ్రైనేజీ సమస్యలు లేకుండా మునిసిపల్, పంచాయితీ రాజ్ శాఖల అధికారులు బాధ్యతగా తగు చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఫ్రైడే డ్రై డే సందర్భంగా తిరుపతి పట్టణంలో పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేసి ప్రజలు ప్రతి ఒక్కరూ వారి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఏదైనా జ్వరాలు వచ్చినప్పుడు సత్వరమే సంబంధిత అధికారులకు తెలియచేయాలని, మునిసిపల్ అధికారులు, పంచాయితీ రాజ్ శాఖల అధికారులు నీటి నిలువ అలానే ఉండకుండా, డ్రైనేజీ సమస్యలు లేకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ వైద్య, మునిసిపల్, పంచాయితీ రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా స్థానిక తిరుపతి పట్టణ పరిధిలోని స్కావెంజర్స్ కాలనీ నందు త్రాగు నీటిని, పరిసరాల పరిశుభ్రత, మురుగు నీటి నిల్వ, ఇంటిలోని ఎయిర్ కూలర్, టైర్ లలో నీరు నిల్వ, డ్రైనేజీ లను స్వయంగా పరిశీలిస్తూ ప్రజలతో మమేకమై వారి ఇంటి వద్దకు వెళ్లి వారి సమస్యలు వింటూ ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ, మురుగు నీటి నిల్వ ఉండడం ద్వారా దోమల లార్వా అభివృద్ధి అయి డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా వంటి జ్వరాలు వస్తాయని, ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటిస్తూ ఇంటిలో నిల్వ ఉన్న నీటిని పారబోసి టాంక్ లని డ్రై గా ఉంచుకోవాలని తద్వారా దోమల లార్వా పెరగకుండా నివారించగలమని వారికి అవగాహన కల్పిస్తూ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. బాలింతలకు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు వస్తున్నారా అని పౌష్టికాహారం, గుడ్లు ఇస్తున్నారా అని ఆరా తీశారు. గుడ్లు మంచి నాణ్యమైనవి చెక్ చేసి వెండర్ సరఫరా చేసేలా చూడాలని ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు. అనంతరం శివాజీ నగర్ కాలనీ నందు కపిల తీర్థం నుండి వచ్చే కాలువ డ్రైనేజీ నందు పూడిక తీత, చెత్తాచెదారం తీసివేయడానికి అక్కడి ప్రజలు కోరగా వారంలోపు గార్బేజ్ తీసివేయడం కొరకు చర్యలు చేపట్టి పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్ కు సూచించారు. సదరు కపిల తీర్థం కాలువలోని పూడిక తీత ఆగస్టు నెలలో చేపడతామని అధికారులు వివరించారు. డెంగ్యూ పాజిటివ్ కేసు నమోదైన 12 సంవత్సరాల దినేష్ అబ్బాయి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ త్వరితగతిన కోలుకుంటారు అని ఏమి భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తూ, అక్కడే ఉన్న తొట్టెలోని నీరు చాలా రోజులుగా నిల్వ ఉండడంతో దోమలు ఉండడాన్ని గమనించి అప్పటికప్పుడు వాటిని శుభ్రపరిచే విధంగా చర్యలు చేపట్టి ఫ్రైడే డ్రైడే గా వాటర్ ట్యాంకులను, నీటి తొట్టెలను శుభ్రపరచుకోవాలని పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తూ ఎప్పుడైనా జ్వరం వచ్చిన వెంటనే సంబంధిత సచివాలయ సిబ్బంది, ఎమ్మెల్ హెచ్ పి వారికి సమాచారం అందించి చికిత్స తీసుకుంటే త్వరితగతిన కోలుకునే అవకాశాలు ఉంటాయని తెలిపారు. మున్సిపల్ హెల్త్ అధికారులకు సూచిస్తూ డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతాలలో సుమారు 200 మీటర్ల వరకు మ్యాలథైన్ స్ప్రే 8 వారాలపాటు చేయాల్సి ఉంటుందని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలని సూచించారు. అనంతరం దామినేడు పంచాయతీ పరిధిలో ఓహెచ్ఆర్ఎస్ ట్యాంకు పరిశీలించి వివరాలు ఆరా తీయగా సదరు ట్యాంక్ శుభ్రపరచి క్లోరినేషన్ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. అక్కడి ప్రజలు డ్రైనేజ్ సమస్య, చెత్త డిస్పోజల్ సమస్యపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా తిరుపతి ఎంపీడీవోకు మరియు మున్సిపల్ కమిషనర్ తిరుపతి వారికి తగు చర్య కొరకు ఆదేశించారు. ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు. అధికారులు పలుమార్లు ప్రజలకు ఈ అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా స్కావెంజర్ కాలనీలో కలెక్టర్ మీడియా తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రైడే డ్రై డే గా పాటించాలని డెంగ్యూ, అతిసార వంటివి ప్రబలకుండా నివారణ, నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించి, ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయిలో సమీక్షిస్తున్నారని తిరుపతి జిల్లాలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా, డయేరియా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య, మునిసిపల్, పంచాయితీ రాజ్ శాఖ, తదితర సంబంధిత శాఖల అధికారులు పూర్తి స్థాయిలో సమన్వయంతో పని చేసి నివారణ, నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించామని, సంబంధిత ఎం ఎల్ హెచ్ పి లు, సచివాలయ సిబ్బంది వారి పరిధిలోని కుటుంబాలకు అందుబాటులో ఉంటూ అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. అలాగే తిరుపతి పట్టణంలో మునిసిపల్ అధికారులు డ్రైనేజీ క్లీనింగ్, రక్షిత మంచి నీరు అందేలా టాంక్ ల శుభ్రపరచడం చేస్తున్నారని, ఇంకా ఎక్కడైనా సమస్య, డ్రైనేజీ బ్లాక్ ఉంటే వాటిని పరిష్కరించడానికి చర్యలు చేపట్టడానికి సూచించామని తెలిపారు. ప్రతి బుధవారం ఎంఎల్హెచ్పి లు త్రాగు నీటి పరీక్షలు చేసి ఏదైనా బ్యాక్టీరియా గుర్తిస్తే సంబంధిత పంచాయితీ రాజ్, మున్సిపల్ అధికారులకు సమాచారం ఇస్తారని, తదనుగుణంగా వారు ప్రత్యామ్నాయ ఏర్పాటు ద్వారా రక్షిత మంచి నీరు అందించే చర్యలు చేపడతారని, అలాగే పంచాయితీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్, మునిసిపల్ శాఖలు ఓహెచ్ఆర్ఎస్ ట్యాంక్ లు 15 రోజులకు ఒకసారి శుభ్రపరచి క్లోరినేషన్ చేపడుతున్నారని, త్రాగు నీటి పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించి తగు చర్యలు చేపట్టి పర్యవేక్షిస్తున్నామని, సోర్స్ వద్ద కూడా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించామని తెలిపారు. జిల్లాలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ లో భాగంగా ఈ నెల 1వ తేదీ నుండి ఆగస్ట్ 31 వరకు రెండు నెలల పాటు ప్రజల్లో పరిసరాల పరిశుభ్రత, త్రాగు నీరు కలుషితం కాకుండా త్రాగు నీరు శుద్ధంగా ఉండేలా క్లోరినేషన్ తదితర చర్యలు చేపట్టాలని, వేడి చేసి నీరు త్రాగాలని, అలాగే డయేరియా బారిన పడిన వారు ఓఆర్ఎస్, జింక్ టాబ్లెట్లు వాడేలా వారికి విస్తృత అవగాహన కల్పిస్తూ, డయేరియా నియంత్రణ చర్యలు చేపడుతున్నామని అన్నారు. స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం 0-5 సం. ల పిల్లలలో డయేరియా మరణాల నివారణ, నియంత్రణ అని తగినన్ని ఓ ఆర్ ఎస్, జింక్ టాబ్లెట్లు స్టాక్ అందుబాటులో ఉండేలా అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఫ్రైడే డ్రై డే పక్కాగా నిర్వహించాలని ఆదేశించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. శ్రీహరి, మునిసిపల్ కార్పొరేషన్ హెల్త్ అధికారి యువరాజ్, మునిసిపల్, డిస్ట్రిక్ట్ ఎపిడమాలజిస్ట్ లావణ్య, వైద్య శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *