Breaking News

27న జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశం కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 27న 4వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశం,ఆ తదుపరి 9వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరుగుతుందని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ(Rajiv Gauba)వెల్లడించారు.ఈమేరకు సోమవారం ఢిల్లీ నుండి ఆయన వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా కేబినెట్ సెక్రటరి మాట్లాడుతూ ఈనెల 27న 4వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈమావేశం ఎక్కడ ఎన్ని రోజులు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని చెప్పారు.అలాగే నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని కూడా త్వరలో నిర్వహించడం జరుగు తుందని అన్నారు.ఈసమావేశాల నిర్వహణకు సంబంధించి ఇప్పటి నుండి సన్నాహక ఏర్పాట్లను ప్రారంభించాల్సి ఉంటుందని తెలిపారు.2047 నాటికి భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశం(వికసిత్ భారత్)గా తీర్చిదిద్దాలన్న లక్ష్యాల్లో భాగంగా జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశం,అదే విధంగా నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలు జాతీయ స్థాయిలో ఎంతో కీలకమైనవని కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబ పేర్కొన్నారు.కావున గత డిసెంబరులో జరిగన 3వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యల నివేదికను వెంటనే సమర్పించాలని చీఫ్ సెక్రటరీలను కేబినెట్ సెక్రటరి ఆదేశించారు.అనంతరం ఈరెండు సమావేశాలకు సంబంధించి పలు ప్రాధాన్య అంశాలు, తీసుకోవాల్సిన చర్యలపై కెబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సీఎస్ లతో చర్చించారు.
ఈవీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్,రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్,మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్,ప్రణాళికా శాఖ ముఖ్యకార్యదర్శి పియూష్ కుమార్,పర్యాటక,వైద్య ఆరోగ్య,పరిశ్రమలు-వాణిజ్యం-ఆహారశుద్ధి,ఉన్నత విద్య, సాంఘిక సంక్షేమ శాఖల కార్యదర్శులు వి.వినయ్ చంద్,మంజుల,డా.ఎన్.యువరాజ్,సౌరవ్ గౌర్,కె.కన్నబాబు,ఎస్పిడి శ్రీనివాస్,గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివాన్ మైదీన్, సిహెచ్ హరి కిరణ్,కృష్ణారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *