Breaking News

ఫ్యాక్టరీలలో ప్రమాద ఘటనలు విషాదకరం

-గత వైసీపీ నేతలు, అధికారుల అవినీతితోనే నేడు ఫ్యాక్టరీలలో ప్రమాదాలు
-సేఫ్టీ ఆడిట్ ను థార్ట్ పార్టీకి ఇచ్చి లంచాలు దోచుకున్నారు
-ఈ సేఫ్టీ అడిట్ పై సాంకేతిక నిపుణులతో రివ్యూ చేస్తాం
-అన్ని ప్యాక్టరీలు, బాయిలర్స్ పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించాం
-బూడిద తింటానికి పెద్దిరెడ్డి ఆయన టీం చేసిన దందా వలనే ఈ విషాద ఘటనలు
-రూ.3000 వేల కోట్ల భవన నిర్మాణ కార్మికుల నిధులను మళ్లించారు
-ఈఎస్ఐ ఆసుపత్రుల నిధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు
-ఇకపై ఎక్కడ రూల్స్ అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటాం
-వైసీపీ పాలనలో అక్రమాలకు అలవాటుపడిన అధికారులు ఇకనైనా మారాలి.. ఇకపై అలాంటివి ఎట్టి పరిస్థుల్లో సాగవు
-ఉచిత ఇసుకపై వైసీపీ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది
-కోట్లు కొట్టేసి… అబద్దాలతో ప్రెస్ మీట్ లు పెడితే ప్రజలు నమ్మరు
-మీ అబద్దాలను నమ్మకే ప్రజలు వైసీపీకి 11 సీట్లు కట్టబెట్టారు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో.. అనుభవం లేని అధికారులను నియమించి.. థార్డ్ పార్టీ చేతిలో సేఫ్టీ ఆడిట్ ను పెట్టి లంచాలు కొల్లగొట్టడంతోనే నేడు ఫ్యాక్టరీలలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆంధ్రప్రదేశ్ కార్మిక, కర్మాగార, బాయిలర్స్‌ & వైద్య బీమా సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఉచిత ఇసుకపై వైసీపీ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ.. ఇసుక గురించి జగ్గిరెడ్డి మాట్లాడుతూంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. గత ఐదేళ్లు ఇసిక మాఫియాను గుప్పిట్లో పెట్టుకుని కోట్లు కొల్లగొట్టిన వ్యక్తి జగ్గిరెడ్డి. ఇసుకను గుప్పిట్లో పెట్టుకుని భవన నిర్మాణ కార్మకుల పొట్టకొట్టారు. సుమారు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వైసీపీ అరాచక పాలనలో రోడ్డున పడ్డారు. వైసీపీ పాలనలో ఇసుకలో రూ. 9750 కోట్లు కొట్టేశారు. రైతుల గురించి మాట్లాడే హక్కు వైసీపీ లేదు. వైసీపీ అరాచక పాలనలో రైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో మూడోస్తానంలో ఉంది. ఖజానాను ఖాళీ చేసి ధాన్యం డబ్బులు కూడా చెల్లించకుండా రైతులను ఇబ్బంది పెట్టారు. టీడీపీ అదికారం వచ్చిన వెంటనే రూ. 1000 కోట్లు చెల్లించి రైతులను ఆదుకున్నాం.

ఇచ్చిన మాట ప్రకారం 1వ తేదీనే రూ.7000 పింఛన్ ఇచ్చాం. ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. అబద్దాలతో అవగాహనలేని ప్రెస్ మీట్ లు పెడుతున్నారు, నిరుద్యోగుల సమస్యలపై జగ్గిరెడ్డి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. వికాస సంస్థతో ద్వారంపూడి దోపిడి గురించి అందరికి తెలుసు. సూపర్ సిక్స్ లో భాగంగా నిరుద్యోగ భృతి, మెగా డీఎస్పీ విడుదల చేస్తామని చెప్పాం. అన్నట్లుగానే మెగా డీఎస్సీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానిపై సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే సంతకం చేశారు. నిరుద్యోగ భృతికి మేము కట్టుబడి ఉన్నాం. స్కిల్ సెన్సెస్ తో ఉపాధి కల్పన కృషి చేస్తాం. చంద్రబాబు పాలనలో ఖచ్చితంగా ఐదులక్షల ఉద్యోగాలు ఇస్తాం. మీ అవినీతి అరాచక పాలనకు ఫలితమే.. మీకు వచ్చిన 11 సీట్లు .. అధికారం కోల్పోయిన మీరు నిరుద్యోగ భృతికోసం ఎదురు చూస్తున్నారు. టీవీలు చూస్తూ ఉండండి మేము ఖచ్చితంగా అమలు చేస్తాం, పవన్ కల్యాణ్ , లోకేష్ గారి ఆద్వర్యంలో స్వర్ణాంధ్రను తయారు చేస్తాం.

వైసీపీ నేతలు చేసిన పాపాలే… నేడు ఫ్యాక్టరీలలో ప్రమాదాలకు కారణం
ఇటీవలే పలు ఫాక్టరీలలో ప్రమాదాలు జరిగి నలుగురు చనిపోవడం చాలా బాధాకరం. నేడు అచ్చుతాపురంలో వసంత్ కెమికల్స్ లో కూడా ప్రమాదం చోటుచేసుకుని ప్రధీప్ అనే వ్యక్తి మరణించాడు. అలాగే సామర్లకోట మండలం అచ్చంపేటలోని జనని కాంక్రీట్ రెడీ మిక్స్ కంపెనీలో ప్రమాదం జరింది. ఈ ప్రమాదంలో 18 సంవత్సరాల యువకుడు రెడిమిక్స్ మిల్ లో పడి మృతి చెందాడు. ఈ యాజమాన్యాలు మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాయి. మృతులకు ప్రకటించిన ఎక్స్ గ్రేషియాను పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. అనుభవంలేని అధికారులను నియమించడం, సేఫ్టీ ఆడిట్ అనేదాన్ని థార్డ్ పార్టీ ఏజెన్సీలకు ఇచ్చి లంచాలు దోచుకుని విచ్చలవిడిగా లైసెన్స్ లు వైసీపీ హయాంలో జారీ చేయడంతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

ఈ సేఫ్టీ అడిట్ పై సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో రివ్యూ చేస్తాం. అన్ని ప్యాక్టరీలు, బాయిలర్స్ పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించాం. ఏపీ జెన్ కో 1800 మెగావాట్ల ప్రాజెక్టుపై నాలుగేళ్లు నిర్లక్ష్యంగా ఉండి హడావిడిగా ఎన్నికల ముందు.. అసంపూర్తి ప్రాజెక్టులను ప్రారంభించడం వలనే ప్రమాదం చోటుచేసుకుంది బూడిద తింటానికి పెద్దిరెడ్డి ఆయన టీం చేసిన దందా వలనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సుమారు రూ. 3000 కోట్ల భవన నిర్మాణ కార్మికులకు చెందిన నిధులను దారిమళ్లించారు ఈఎస్ఐ ఆసుపత్రులను నిర్లక్ష్యం చేశారు. కేంద్రం నుండి వచ్చిన రూ. 400 కోట్లలలో రూ.300 కోట్లు తిరిగి సెంట్రల్ కు పోయింది.అంటే వైసీపీ అసమర్థత ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ ప్రభుత్వం థార్డ్ పార్టీలతో ఫ్యాక్టరీలను బెదిరించి డబ్బులు దోచుకున్నారు. దాని ప్రభావమే.. ఫ్యాక్టరీలలో ప్రమాదాలకు కారణం. ఇకపై ఎక్కడైనా రూల్స్ అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటాం. వైసీపీ పాలనలో అక్రమాలకు అలవాటుపడిన అధికారులు ఇకనైనా మారాలి.. ఇకపై అలాంటివి ఎట్టి పరిస్థుల్లో సాగవు. థార్ట్ పార్టీ, అధికారులు కుమ్మక్కై ఫ్యాక్టరీలలో భద్రతా చర్యలను నిర్లక్ష్యం చేయడం వలనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *