Breaking News

మున్సిపాలిటీల్లో డ్రైన్లు పూడిక తీత పనులకు రూ.50 కోట్లు విడుదల

-సీజనల్ వ్యాధుల నియంత్ర్రణకు,త్రాగునీరుకలుషితం కాకుండా లీకులనుఅరికట్టేందుకు చర్యలు
-నిరుపేదలకు అతి తక్కువకే ఆహారాన్ని అందించే అన్నాక్యాంటీన్లు ఆగస్టు 15 నుండి ప్రారంభం
-రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని 106 మున్సిపాలిటీల్లో డ్రైన్ల పూడిక తీత పనులకు రూ.50 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్లు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. వచ్చే పది రోజుల్లో అన్ని డ్రైన్లలో శతశాతం పూడికతీత పనులు పూర్తి చేయాలని మున్సిఫల్ కమిషనర్లను ఆదేశించినట్లు తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 106 మున్సిపాల్టీలు, 17 మున్సిఫల్ కార్పొరేషన్ల కమిషనర్లతో నేడు వీడియో కాన్పరెన్సు నిర్వహించి ప్రస్తుత సీజన్ లో ఎటు వంటి వ్యాధులు ప్రభల కుండా ఉండేందుకై పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ మద్య కాలంలో పిడుగురాళ్ల మున్సిపాలిటీలోని లెనిన్ నగర్, మారుతీ నగర్ లలో డయేరియా కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయని, అందుకు ఆయా ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఆర్.ఓ.ప్లాంట్లు, బోరు బావుల్లో కలుషితమైన నీటిని త్రాగడమే కారణమనే విషయాన్ని గుర్తించి, వాటిని ఆపివేయడం వల్ల డయేరియా తగ్గిందన్నారు. ఆ మున్సిపాలిటీలో త్రాగునీరు సరఫరా చేసే ఏడు మోటారు బావుల భూగర్బ ఫైపుల్లో లీకేజీలు ఉండటం వల్ల వాటిని మరమ్మత్తులకై త్రాగు నీటి సరఫరాను తాత్కాలికంగా ఆపివేయడం వల్ల ఈ సమస్య ఉద్బవించిందని మంత్రి తెలిపారు. పైప్ లైన్ల మరమ్మత్తు పనులు, డ్రైన్ లలో పూడిక తొలగింపు పనులను యుద్ద ప్రాతిపదికన నిర్వహిస్తున్న నేపథ్యంలో కాచి చల్లార్చిన నీటినే త్రాగాలని ప్రజలకు విజ్ఞిప్తి చేయడం జరిగిందన్నారు.

ఆగస్టు 15 న అన్నా క్యాంటీన్లు ప్రారంభం…
నిరుపేదలకు అతి తక్కువ రేట్లకే నాణ్యమైన ఆహారాన్ని ఆహ్లాదకర వాతావరణంలో అందించే అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15 నుండి రాష్ట్రంలో ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో 203 అన్నా క్యాంటీన్లను ప్రారంభించినప్పటికీ 183 క్యాంటీన్లు మాత్రమే ఫంక్షనింగ్ లోకి వచ్చాయని, వాటి ద్వారా రోజుకి దాదాపు 2.25 లక్షల మంది భోంచేసేవారని తెలిపారు. మిగిలిన 20 క్యాంటీన్లలో 18 క్యాంటీన్ల భవనాలు పూర్తవ్వగా, 2 క్యాంటీన్ల భవనాలు ప్రాధమిక దశలోనే నిలిచిపోయాయన్నారు. అయితే గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను అన్నింటినీ మూసేసి వాటిలో కొన్నింటిని వార్డు సచివాలయాలుగా మరికొన్నింటిని స్టోరేజ్ రూములుగా వినియోగంచుకోవడం జరిగిందన్నారు. ఆయా భవనాలు అన్నింటినీ పూర్తి స్థాయిలో క్యాంటీన్లుగా తీర్చిదిద్దేందుకు, అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణ పనులను వచ్చే నెల 10 వ తేదీ లోపు పూర్తి చేసేందుకు టెండర్లను కూడా ఖరారు చేయడం జరిగిందన్నారు. గతంలో అక్షయ పాత్ర సంస్థ ఎంతో చక్కగా నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేసేదని, అదే తరహాలో, అదే రేట్లకు ఈ సారి కూడా ఆహారాన్ని సరఫరా చేసేందుకు టెండర్లను కూడా స్వీకరించడం జరిగిందని, వాటిని ఈ నెల 22 వ తేదీన ఓపెన్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

ఏ.ఐ.ఐ.బి. ప్రాజెక్టును మరో రెండేళ్ల పాటు పొడిగింపుకు చర్యలు…
ఏషియ‌న్ ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ప్రాజెక్టు గడువు జూన్ నెలాఖరుకు ముగిసిందని, మా ప్రభుత్వం విజ్ఞప్తిపై మరో మాసం పాటు ఆ ప్రాజెక్టు గడువును ఏషియ‌న్ ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు పొడిగించిందన్నారు. అయితే ఆ గడువును మరో రెండేళ్ల పాటు పొడిగించాలని ప్రభుత్వం కోరినట్లు మంత్రి తెలిపారు. గ‌తంలో తమ ప్రభుత్వ హయాంలో ప్ర‌తి ఇంటికీ 24 గంటల పాటు త్రాగు నీరు అందించడంతో పాటు మురుగు నీటి పారుదల పైపులు, మురుగు నీటి శుద్ది ప్లాంట్లు, వరద నీరు పారుదల కాలువలు ఏర్పాటు పనులను చేపట్టడం జరిగిందన్నారు. దీనికోసం ఏషియ‌న్ ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ద్వారా రూ.5,350 కోట్లు కేటాయించామ‌న్నారు. అయితే ఈ నిధుల్లో గత ప్రభుత్వం కేవలం రూ.240 కోట్లను మాత్రమే వెచ్చించి మిగిలిన నిధుల వినియోగానికి రాష్ట్ర వాటాను కేటాయించకుండా నిరుపయోగంగా వదిలేసిందన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయి ఉంటే కనీసం 50 శాతం మున్సిపాలిటీల్లో త్రాగునీటి సమస్య ఉండేది కాదన్నారు.

అదే విధంగా లక్ష లోపు జనాభా ఉన్న నగర పంచాయితీల్లో మౌలిక వసతుల మెరుగుకు అమృత్-I&II ప్రాజక్టులను తమ ప్రభుత్వ హయాంలో చేపట్టగా, గత ప్రభుత్వం ఆ ప్రాజక్టులను కూడా నీరుగార్చిందన్నారు. అమృత-I పథకం క్రింద చేపట్టిన పనులను అసంపూర్తి గా వదిలేయడం జరిగిందని మరియు అమృత్-II పథకం క్రింద ఎటు వంటి పనులను ప్రారంభించ కుండా వదిలేసిందన్నారు. ఆ పథకాలను పునరుద్దరించి రాష్ట్రంలో వాటిని తిరిగి అమలు చేసేందుకు అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు మంత్రి తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *