Breaking News

ఫ్రైడే డ్రైడే పాటిద్దాం – డెంగ్యూ,మలేరియాలను నివారిద్దాం 

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
చిలకలపూడి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ వి.శ్రావ్య పర్యవేక్షణలో  శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఆషా మరియు ఆరోగ్య కార్యకర్తల ద్వారా దోమల నియంత్రణ కొరకు ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటిస్తూ గృహ దర్శనముల ద్వారా ఇళ్ళలోఉన్న నిల్వ నీటిలోని లార్వాలను తొలగించుట ,నీటి నిల్వలు ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లు ,టైర్లు ,వృధాగా పారవేసిన ప్లాస్టిక్ బాటిల్లు , టైర్లు ,వృధాగా పారవేసిన ప్లాస్టిక్ కుండీలు ,ఇతర గృహపకరణాలను శుభ్రము చేసుకోవాలని ప్రజలకు సూచించమనిరి .ప్రస్తుతం జిల్లాలో జరుగుచున్న ఎల్సిడిసి సర్వే ద్వారా అనుమానిత లక్షణాలున్న కుష్టి వ్యాధిగ్రస్తులను గుర్తించి వ్యాధి నిర్ధారణ కొరకు పంపించినచో అవసరమైన వారికి ఎండిటి మందులను అందించుట జరుగుతుందని తెలియజెచ్చినారు. వీటితోపాటు గృహ దర్శనముల సమయంలో ఎవరైన గత వారం రోజులలో గాని ,ప్రస్తుతం గాని నీళ్ల విరోచనాలు అతిసారం వంటి వ్యాధులతో బాధపడుతున్న వారి గురించి తెలుసుకొని కావలసిన వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లను , జింక్ మాత్రలను అందించి వ్యాధి నివారణ చర్యలు చేపట్టవలసినదిగా వైద్య సిబ్బందిని వైద్యాధికారి ఆదేశించినారు . మలేరియా సబ్ యూనిట్ అధికారి పి.మురళి మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీజనల్ వ్యాధులైన మలేరియా ,డెంగ్యూ వంటివి ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కాల్వలలో నిలవనీరు లేకుండా మునిసిపాలిటీ వారి సహాయంతో పారుదల అయ్యేటట్లు చూడవలసిందిగా కోరినారు . ఈ సందర్భంగా జిల్లా ఆరోగ్య విద్య మరియు విస్తరణాధికారి బి . శివసాంబి రెడ్డి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ,దోమల నియంత్రణ చర్యలపై ఇంటిటి ప్రచారం ద్వారా ప్రజలలా చైతన్యము కలిగించవలసినదిగా వైద్య సిబ్బంది కి తెలియజేసినారు . ఈ సందర్భంగా వైద్యాధికారి మరియు ఆశా కార్యకర్తలు ,ఆరోగ్య కార్యకర్తలు టీం వర్క్ గా వెళ్లి గృహ దర్శనములు చేసి లార్వాలు ఉన్న నీటి నిల్వలు గుర్తించి తొలగించటమైనది .ఈ కార్యక్రమంలో ఏ . నాగమణి ఏఎన్ఎం, కే బాలాజీ ,సిహెచ్ ప్రవీణ్ కుమార్ ,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

సమర్థవంతమైన నాయకత్వంతో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది…

-సాటిలైట్ సిటీ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న గోరంట్ల… -పిడింగొయ్యి గ్రామంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *