Breaking News

ఆటో మేటిక్ వాతావరణ కేంద్రం పరిశీలన

-పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి
-ముంపు ప్రాంతాలలో పర్యటన.. శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి
-రావిమెట్ల ఎంపిపి స్కూలు వైద్య శిబిరం పరిశిలన
-వైద్య శిబిరం సందర్శన, నెలలు నిండిన వారు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందాలి
– జిల్లా కలెక్టర్ పి..ప్రశాంతి

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
నిడదవోలులో ఏర్పాటు చేసిన ఆటో మేటిక్ వాతావరణ కేంద్రాన్ని శనివారం ఉదయం కలెక్టర్ పి. ప్రశాంతి తనిఖీ చేశారు.
ఈ పరికరం యెుక్క పనితీరు పై సమగ్ర సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుంచి నమోదు కాబడిన వివరాలు కోరగా, సెంట్రల్ వాతావరణ కేంద్రానికి అనుసంధానం కాబడి ఉన్న దృష్ట్యా అక్కడి నుంచే సమాచారం తెలిసే అవకాశం ఉందని వివరించారు. స్వయంచాలక వాతావరణ కేంద్రం (automatic weather station) అనేది ఉష్ణోగ్రత, గాలి వేగం దిశ, సౌర వికిరణం వర్షపాతం వంటి వాతావరణ వివరాలు కొలవడానికి, నమోదు చేయడానికి, ఆయా వివరాలు ఎప్పటి కప్పుడు తరచుగా ప్రసారం చేయడానికి ఉపయోగించేందుకు రూపొందించిన వ్యవస్థ అని తెలియ చేసారు. వాతావరణ స్టేషన్లు కు ఆయా సమాచారం చేరి, వాటిని క్రోడికరించి క్షేత్ర స్థాయిలో కార్యాచరణ, పరిశోధన ప్రయోజనాల కోసం ఉపయుక్తం గా నిలుస్తుందని కలెక్టర్ కు వివరించారు. బసివిరెడ్డి పేట వర్షపాత నమోదు పరికరాన్ని పరిశీలించారు. ఉదయం 8.30 నుంచి ఉ.11.30 వరకు 1.5 ఎమ్ ఎమ్ వర్షపాతం నమోదు అయినట్లు ఏ ఎస్ వో జి. ఏ. ప్రసన్న కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 28 ఏ డబ్ల్యూ ఎస్ స్టేషన్లు ఉన్నట్లు తెలిపారు.

అనంతరం శింగవరం ఎంపిపి స్కూలు లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడ బస ఏర్పాట్లు, శానిటేషన్, వైద్య శిబిరం వంటి వాటినీ పరిశీలించి సూచనలు చేశారు. వాతావరణ పరిస్థితులు అనుగుణంగా తరలింపు ప్రణాళికలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వరద నీరు చేరినా ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. పునరావాస కేంద్రాలకు స్వచ్ఛందంగా తరలి రావాలని అధికారులు ఇచ్చే సూచనలు అనుసరించాల్సి ఉంటుందన్నారు. ఏ ఒక్కరూ చేపల వేటకి వెళ్ళడం గానీ, వరద ప్రవాహం చూసేందుకు వెళ్ళడం చేయరాదని విజ్ఞప్తి చేశారు. వరద ముంపు ప్రభావం, నీటి ఉదృతి ఉన్న శివారు ప్రాంతాలలో కలెక్టర్ పర్యటించారు. వరద నీటిలో పాములు కొట్టుకొని వచ్చే అవకాశం ఉందని, చెరువుగట్లు, పొలం గట్లు వద్ద జాగ్రత్తగా ఉండాలన్నారు. వరద నీరు చూడడానికి పిల్లల్ని పంపరాడని తల్లితండ్రులను కోరారు. అధికారులు కూడా ఈ విషయములో జాగ్రత్త వహించాల్సి ఉందన్నారు. వైద్య శిబిరాలో, పి.హెచ్.సి. , సి హెచ్ సి లలో స్నేక్ బైట్ (పాము కాటు) యాంటి వైరల్ మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రావిమెట్ల ఎంపిపి స్కూలు వైద్య శిబిరం పరిశిలన నిడదవోలు సి హెచ్ సి లో అదనపు బెడ్స్ 20 అందుబాటులొ ఉంచినట్లు వైద్యాధికారులు వివరించారు. మందులు, ఇంజెక్షన్లు, ఐ వి ద్రవాలు, అత్యవసర మందులు సిద్ధంగా ఉన్నట్లు తెలియ చేసారు. సిబ్బంది హాజరు వివరాలు కలెక్టరేట్ కమాండ్ సెంటర్ కి పంపాలి.

కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, డి ఎమ్ హెచ్ వో కే. వేంకటేశ్వర రావు, డి సి హెచ్ ఎస్ – ఎన్ పి పద్మశ్రీ, తహసీల్దార్ వి. నాగభూషణం, ఎమ్ పి డి వో – జే ఏ ఝాన్సి, ఇతర అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

బిఎల్ఓలు ఇంటింటి ఓటర్ సర్వే చేస్తున్నారు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో బిఎల్ఓలు ఇంటింటి ఓటర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *