Breaking News

వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి

-ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరి ఎపిఐఐసి టవర్స్ వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం సంబంధిత అధికారులతో కమీషనర్
సమీక్ష నిర్వహించారు. వర్షాలు పడుతున్నందున అంటు వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాధుల బారినపడి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. స్థానిక ప్రచార సాధనాలద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రేడియో జింగిల్స్ , ఎఫ్ ఎం , లోకల్ ఛానళ్ల ద్వారా ప్రబలుతున్న వ్యాధులపై ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఐ అండ్ పిఆర్ డైరెక్టర్ ను సంప్రదించాలన్నారు. మలేరియా , డెంగ్యూ, చికున్ గున్యా ప్రబలేందుకు అవకాశమున్న ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు , అవగాహన కల్పించేందుకు వ్యక్తిగత మొబైల్ నంబర్లకు మెసేలు పంపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాధుల నియంత్రణ విషయంలో లక్ష్యాలకు మించి పనిచేయాలన్నారు. డయేరియా విషయంలో 24 గంటలూ పర్యవేక్షణ ఉండాలన్నారు. డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం ఏడీ డాక్టర్ సుబ్రమణ్యేశ్వరి, జేడీ డాక్టర్ మల్లేశ్వరి , ఎన్వీబిడిసి ప్రోగ్రాం డీడీ రామనాధరావు , స్టేట్ కన్సల్టెంట్లు సమీక్షలో పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *