Breaking News

విత్తనదృవీకరణ సంస్థ శాకాధిపతులతో సమీక్ష

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరి వ్యవసాయశాఖ సంచాలకుల (డైరెక్టర్) వారి కార్యాలయము లో శుక్రవారం ప్రత్యేక ముఖ్య కార్యదర్శి (వ్యవసాయం & సహకార) బుడితి రాజశేఖర్ IAS, వారి ఆధ్వర్యంలో వ్యవసాయ మరియు అనుబంధ రంగాలైన ఉద్యాన, మార్కెటింగ్, పట్టు పరిశ్రమశాఖ, విత్తనాభివృద్ధి సంస్థ, ప్రణాళిక మరియు విత్తనదృవీకరణ సంస్థ శాకాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వ్యవసాయరంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినదృష్ట్యా మన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్కు అనుగుణంగా సమర్పించే ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సోమవారం వ్యవసాయ మరియు అనుబంధ రంగాల బడ్జెట్ పై సమీక్ష ఉన్న దృష్ట్యా ప్రతి అనుబంధ శాఖ వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ (VOA) కు కొనసాగింపు గా బడ్జెట్ అంచనాలు 2024- 25 మరియు 100 రోజుల వికసిత ఆంధ్రప్రదేశ్ కు తగిన ప్రతిపాదనలు సిద్దం చేయాలని, తెలియచేసారు.

గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయం లో ఏర్పడుతున్న సాగు,మార్కెటింగ్ తదితర సమస్యలకు ప్రత్యామ్నాయంగా వినూత్నమైన ఆలోచనలతో ప్రతిపాదనలను సిద్దం చేయాలని తెలిపారు. వరికి ప్రత్యామ్నాయంగా లాభసాటి పంటల సాగు, ప్రజాపంపిణీ వ్యవస్థకు అనువైన వంగడాల సాగు, బీడు భూములలో తొలకరికి ముందు తృణదాన్యాల నవధాన్యాల సాగు చేపట్టాలన్నారు. ఉత్తమ యాజమాన్య పద్ధతులు మరియు దిగుబడుల సంస్కరణల దిశగా ఆలోచనలు మరల్చి వినూత్నoగా ప్రతిపాదనలు పంపాలని తెలియచేసారు.

ఈ సమావేశం లో  ఎస్.డిల్లిరావు IAS, సంచాలకులు వ్యవసాయశాఖ , ఎస్ ఎస్ .శ్రీధర్ IFS, కమీషనర్ పట్టుపరిశ్రమ శాఖ
ఎం. విజయసునీత IAS, డైరెక్టర్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, డా. మనజిర్ జిలాని సమూన్ IAS, మేనేజింగ్ డైరెక్టర్మార్క్ ఫెడ్ , గెడ్డం శేఖర్ బాబు IFS, డైరెక్టర్ SAAP మరియు CEO రైతుబజార్, మార్కెటింగ్ శాఖ శివప్రసాద్ IFS మేనేజింగ్ డైరెక్టర్విత్తనాభివృద్ది సంస్థ వారు మరియు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *