Breaking News

సురక్షిత త్రాగునీటి సరఫరా కు నిరంతర పర్యవేక్షణ అవసరం

-ఆగస్టు 5 కల్లా అన్న క్యాంటీన్ల పనులు పూర్తి కావ్వాలి
-వాహనాలను అందుబాటులో ఉంచి పారిశుద్ధ నిర్వహణను మెరుగుపరచండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు సురక్షితమైన త్రాగునీటినే సరఫరా చేసేటట్టు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని, బుధవారం ఉదయం డాక్టర్ కె ఎల్ రావు హెడ్ వాటర్ వర్క్స్ ను పరిశీలించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తదుపరి ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ -విద్యధరపురం, హెచ్ బి కాలనీ, గాంధీజీ మహిళా కళాశాల దగ్గర జరుగుతున్న అన్న క్యాంటీన్ల పునః నిర్మాణ పనులను ఆగస్టు 5 కల్లా, అన్ని వసతులతో, పూర్తిచేయాలని ఇంజనీరింగ్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. తదుపరి హనుమాన్ పెట్టలో గల వెహికల్ డిపోను సందర్శించి పరిశీలించారు. పారిశుద్ధ నిర్వహణలో వాడుతున్న ప్రతి వాహనం అందుబాటులో ఉంచాలని, మరమతుల్లో ఉన్న వాహనాలను సత్వరమే అందుబాటులోకి తీసుకురావాలని, అవసరమైతే ఇంకొన్ని వాహనాలను పెంచి పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ పర్యటనలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ తో పాటు చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నావళి, యస్ ఈ రామ్మోహన్ రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ప్రసాద్, వెంకటేశ్వర రెడ్డి, ఇంజనీరింగ్ సిబ్బంది, సానిటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

యధావిధిగా సెప్టెంబరు 23 సోమవారం “పీజీఆర్ఎస్ ‘మీ కోసం”

-జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *