Breaking News

అనపర్తి నియోజకవర్గం రామవరం గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం

-రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
-దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణరెడ్డి

అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
సమర్థవంతమైన పరిపాలనాధ్యక్షుడు ఉంటే సంక్షేమ పథకాలు అమలు తీరుకు ప్రత్యక్ష నిదర్శనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. గురువారం అనపర్తి నియోజక నియోజకవర్గం అనపర్తి మండలం రామవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం లో రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు,  రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయ రెడ్డి, స్థానిక నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గౌరవ అతిథిగా హాజరైన రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్లను సకాలంలో పంపిణీ చేయలేదని కొందరు వ్యాఖ్యలు చేశారన్నారు. గత నెలలో పెన్షన్ లను ఇంటింటికీ వెళ్లి రోజున్నర లోగానే అందించడం జరిగిందన్నారు. ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 64 లక్షల 90 వేల మంది కి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారన్నారు. ఉదయం 9.30 గంటలకే  97 శాతం మందికి పంపిణీ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.  పార్టీలకు అతీతంగా అందరం సమైక్యంగా రాష్ట్ర అభివృద్ధికి అంకితభావంతో పని చేద్దామని స్పీకర్ పిలుపునిచ్చారు. తద్వారా రాబోయే తరాలకు ఎంతో మేలు చేస్తుందని ఆయన అన్నారు. పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు శాసనసభలకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించి ఆ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిదులు సభలో ప్రతి ఒక్క శాసనసభ్యులకు మాట్లాడే అవకాశం, ఉందని  ప్రతి ఒక్కరికీ అవకాశం ఇస్తానన్నారు. తద్వారా సభాపతిగా రాష్ట్ర అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని అయ్యన్న పాత్రుడు తెలియ చేశారు.

ప్రతీ నెల ఒకటవ తారీఖునే సచివాలయ సిబ్బంది ద్వారా ప్రజల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లను పంపిణీ చేయడంలో భాగంగా ఈరోజు రామవరం గ్రామంలో పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు కూటమి నాయకులు పాల్గొనడం  జరుగుతోందన్నారు

అనపర్తి మండలం రామవరం గ్రామంలో మూలారెడ్డి వీధిలో నివాసం ఉంటున్న కోనాల సోమిరెడ్డి కి , సత్తి విష్ణు రెడ్డి లకు వృధ్యపు పెన్షన్లు, కోనాల మంగాయమ్మ కు వితంతు పేన్షన్ అందజేశారు.

తొలుత రామాపురం చేరుకున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు కు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం శాసనసభ్యులు నివాసంలో మాజీ శాసనసభ్యులు స్వర్గీయ నలమిల్లి మూలరెడ్డి చిత్రపటానికి , తదుపరి రామాపురం లోమూలారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఆర్డిఓ ఆర్ కృష్ణ నాయక్, మండల స్పెషల్ ఆఫీసర్ పంచాయతీ అధికారి ఎమ్. నాగలత,  మాజీ మంత్రి కే. ఎస్.జవహర్ రెడ్డి , టి.సుధాకర్ రెడ్డి, తాడి గంగిరెడ్డి కు పి. శ్రీనివాసు, కర్రీ వెంకటరామారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *