Breaking News

గోకవరం నుంచి తంటికొండ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు రు. 3.75 కోట్లతో నిర్మించనున్న రహదారికి శంకుస్థాపన

-ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు

గోకవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గోకవరం నుంచి తంటికొండ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు రు. 3.75 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఆర్ అండ్ బి రహదారికి శంఖుస్థాపన చేసుకోవడం జరిగిందని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. గురువారం గోకవరం మండలం తంటిటికొండ గ్రామంలో నిర్మించునున్న ఆర్ అండ్ బి రహదారి పనులకు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్థానిక శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూతో కలిసి భూమి పూజ చేసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ నేడు గోకవరం నుంచి తంటి కొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు 4.21 కిలోమీటర్ల నిడివి గల ఆర్ అండ్ బి రహదారిని రు. 3.75 కోట్ల రూపాయలతో నిర్మించుకునేందుకు శంకుస్థాపన వంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన తదుపరి శ్రీ వెంకటేశ్వర స్వామి కార్యక్రమంలో పాల్గొని, శ్రీ స్వామివారి ఆశీస్సులు పొందటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఇక్కడకు విచ్చేసిన నాకు అఖండ స్వాగతం పలిగిన ఈ ప్రాంత ప్రజలకు, దేవాదాయ శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.

గతంలో తాను ఏడు పర్యాయలు మంత్రి గా పని చేయడం జరిగిందన్నారు. నేడు అసెంబ్లీ స్పీకర్ గా తాను రాజ్యాంగ బద్ధంగా మార్గదర్శకాలు మేరకు విధులను నిర్వహించే బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ శాసన సభలో పార్టీలకు అతీతంగా శాసనసభ్యులందరికీ ప్రజా సమస్యలు పై చర్చించే అవకాశం కల్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ రహదారి అభివృద్ధి చేయడం ద్వారా తంటీకొండ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి మరింత ప్రాముఖ్యత పెరుగుతుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శాసనసభ స్పీకర్ శ్రీచింతకాయల అయ్యన్న పాత్రుడును వేదమంత్రాలతో ఆశీర్వచనం పలికి శ్రీస్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.

శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రాధాన్యత క్రమంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేయడం జరుగు తుందన్నారు. ఇందులో భాగంగా నేడు గోకవరం నుంచి
తంటికొండ వరకు రహదారిని నిర్మించుకోబోతున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *